ETV Bharat / bharat

'ఎల్​ఏసీ' వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత క్షిపణులు - భారత్ చైనా సరిహద్దు వివాదం

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా క్షిపణులపై భారత్ నిఘా మరింత పెంచింది. ఇందుకోసం గగనతల రక్షణ వ్యవస్థతో పాటు ఇతర ఆయుధాలను సరిహద్దులో ఉన్న వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించినట్లు సైన్యం తెలిపింది.

India china border issue
చైనాపై భారత్​ నిఘా కట్టుదిట్టం
author img

By

Published : Aug 25, 2020, 8:35 PM IST

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి చైనా వైమానిక కార్యకలాపాలు ఎక్కువైన నేపథ్యంలో... భారత బలగాలు గగనతల రక్షణ క్షిపణులను వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించాయి. రష్యాకు చెందిన ఇగ్లా గగనతల రక్షణ వ్యవస్థతో పాటు ఇతర ఆయుధాలను సరిహద్దులో ఉన్న కీలకమైన ఎత్తుల్లో మోహరించినట్లు సైన్యం తెలిపింది.

క్షిపణి వ్యవస్థలు, రాడార్లు మోహరించడం ద్వారా సరిహద్దుల్లో డ్రాగన్ కదలికలపై నిఘాను భారత్ మరింత మెరుగుపరిచింది. ఇటీవల గల్వాన్ లోయ, పెట్రోలింగ్ పాయింట్ 14కు సమీపంగా వచ్చేందుకు అనేక చైనా చాపర్లు ప్రయత్నించడాన్ని భారత దళాలు గమనించాయి. తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా హెలికాప్టర్లు జరిపే ఎలాంటి గగనతల ఉల్లంఘనలనైనా విఫలం చేయడానికి వైమానిక దళం ఇప్పటికే సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానాలను మోహరించినట్లు సైన్యం వెల్లడించిది.

టిబెట్‌లోని హోటాన్, గార్ గున్సా, కష్గర్, హోపింగ్, లిన్జి పంగట్ వైమానిక స్థావరాల్లో డ్రాగన్‌ కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో చైనా ఎలాంటి దుస్సాహసానికి దిగిన గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌- పాక్ పనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.