ETV Bharat / bharat

యూనిఫామ్​కు మ్యాచింగ్​ మాస్కులు తప్పనిసరి..!

నౌకాదళ అధికారులు ఇకపై యూనిఫామ్​కు మ్యాచయ్యే​ మాస్కులు ధరించనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది భారత నేవీ. ఆదేశాలు పాటించకపోతే జరిమానా కూడా విధించనున్నారు.

Indian Navy asks personnel to wear colour-coded masks matching with uniform
నేవీ సిబ్బందికి డ్రెస్​కోడ్​కు మ్యాచ్​ అయ్యే మాస్కులు
author img

By

Published : May 22, 2020, 7:07 PM IST

మాస్కుల విషయంలో భారత నౌకాదళానికి చెందిన సదరన్​ నేవల్​ కమాండ్ తమ సిబ్బందికి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. సైనికులంతా దుస్తులకు మ్యాచయ్యే మాస్కులు ధరించాలని సూచించింది. తెలుపు ​దుస్తుల్లో ఉన్నప్పుడు అందుకు సరిపోలే ముసుగులే వినియోగించాలని.. ఇక ఏదైనా కార్యక్రమానికి అయితే నలుపు, నేవీ రంగు మాస్కులు ఉపయోగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది కొచ్చిలోని​ నౌకాదళ విభాగం.

ఖాకీ యూనిఫామ్​ ధరించే రక్షణ, అగ్నిమాపక​ సిబ్బంది.. విధుల్లో ఉన్న సమయంలో ఖాకీ ముసుగులు తొడుక్కోవాలని అధికారులు ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా మాస్కులు ఉపయోగించకపోతే జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. తొలిసారి రూ.200, రెండోసారి రూ.2000 వసూలు చేస్తామని తెలిపారు.

వేడి కారణంగానే...

ఇందులో కొన్ని ముసుగులను నేవీ వైవ్స్ వెల్​ఫేర్​ అసోసియేషన్​ తయారు చేయగా.. అతి తక్కువ ఖర్చుతో మరికొన్ని సంస్థలు తయారు చేసి అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేసవి కాలం కావడం వల్ల.. కేరళలో సింథటిక్​ దుస్తులతో రూపొందించిన మాస్కులు సిబ్బందికి అసౌకర్యం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కొచ్చిలోని సైనికులకు కాటన్​ మాస్కులు తప్పనిసరి చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.