ETV Bharat / bharat

'కరోనా టీకాలో పంది ప్రోటీన్​ ఉన్నా తీసుకోవచ్చు' - కరోనా టీకాలో పంది ప్రోటీన్​ ఉన్నా తీసుకోవచ్చు

కరోనా టీకాలో పంది నుంచి తీసిన ప్రోటీన్​ ఉన్నా దాన్ని తీసుకోవచ్చని ముస్లింలకు జమాతే ఏ ఇస్లామీ హింద్​ సంస్థ తెలిపింది. ఫత్వాల జారీ కరోనా టీకాకు వర్తించదని పేర్కొంది.

NAT_Indian Islamic body okays use of COVID vaccine with pork gelatin_26122020_Tauseef
కరోనా టీకాలో పంది ప్రోటీన్​ ఉన్నా తీసుకోవచ్చు: జేఐహెచ్​
author img

By

Published : Dec 26, 2020, 8:27 PM IST

కరోనా టీకాలో పంది నుంచి తీసిన ప్రోటీన్​ ఉన్నా ఆ వాక్సిన్​ తీసుకోవచ్చని జమాత్​ ఏ ఇస్లామి హింద్(జేఐహెచ్​)​ ముస్లిం సంస్థ తెలిపింది. వైద్యాధికారులు అనుమతించిన ఏ ఔషధాన్నైనా, టీకానైనా ముస్లింలు తీసుకోవచ్చని జేఐహెచ్​ ఉపాధ్యక్షులు మహ్మద్​ సలీం​ ఈటీవీ భారత్​తో అన్నారు. ఈ విషయంలో ఫత్వాలు జారీచేయవద్దన్నారు.

ఔషధంలో పంది నుంచి తీసిన ప్రోటీనే వాడాలని కాకుండా దానికి ప్రత్యామ్నాయం ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ ప్రత్యామ్నాయం లేక పోయినా పర్వాలేదు. ఆ ఔషధాన్ని, టీకాను ముస్లింలు తీసుకోవచ్చు. దీనికి ఫత్వాలు జారీచేయకూడదు. మనం తీసుకునే చాలా టానిక్​లలో ఆల్కహాల్​ వాడుతున్నారు. రోగం వచ్చినప్పుడు అవి మనం తీసుకుంటున్నాం కదా..

-మహ్మద్​ సలీం ఇంజనీర్​, జేఐహెచ్​ ఉపాధ్యక్షుడు

చైనా తయారుచేసిన కరోనా టీకాలో పంది నుంచి తీసిన ప్రోటీన్ను వాడారని రాజా అకాడమీ ప్రధాన కార్యదర్శి సయీద్​ నూర్​ ఇటీవల అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చైనా నుంచి టీకాను తేవొద్దని ప్రభుత్వాన్ని కోరారు. పంది నుంచి తీసిన ఎటువంటి పదార్థాన్నైనా ముస్లింలు తీసుకోవడం నిషిద్ధం అని అన్నారు.

పంది నుంచి తీసిన ప్రోటీన్​ కరోనా టీకాలో ఉన్నా.. దాన్ని ఇస్లాం వ్యతిరేకించదని యూఏఈ ఫత్వా కౌన్సిల్​ ఛైర్మన్ షేక్​ అబ్దుల్లా బిన్​ భయ్యా అన్నారు. ఇస్లాం మానవజాతి మేలును కోరుతుందని వ్యాఖ్యానించారు.

కరోనా టీకాపై వస్తున్న వదంతులను పట్టించుకోవద్దని ప్రఖ్యాత సున్నీ మతగురువు ఖలీద్​ రషీద్​ ఫిరంగీ మహాలీ..ముస్లింలకు సూచించారు. టీకాను తీసుకోవచ్చన్నారు.

ఇదీ చూడండి: కరోనా బాధితుల కోసం జమాతే ఇస్లామీ హింద్​ ప్రత్యేక హెల్ప్​లైన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.