మాస్క్‌ల ఎగుమతిపై ఉన్న నిషేధంలో కొన్ని సండలింపులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది కేంద్ర ప్రభుత్వం. నాన్ సర్జికల్, నాన్ మెడికల్ మాస్కులైన కాటన్, సిల్క్, ఊల్ మాస్కులకు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చింది. ఐటీసీ హెచ్‌ఎస్ పరిధిలోకి వచ్చే మాస్క్‌లపై ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన ఉత్తర్వుల్లో పలు సవరణలు చేసింది. అయితే ఎన్-95 వంటి మాస్కులపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో.. మార్చి 19 నుంచి మాస్కులు, వాటి ముడిసరుకు ఎగుమతులపై నిషేధం విధించింది కేంద్రం.