ETV Bharat / bharat

'21 రోజుల నిర్బంధం... ప్రాణాలకన్నా ఎక్కువేం కాదు' - భారత్​ లాక్​డౌన్

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించారు. 21 రోజుల నిర్బంధం ప్రాణాలకన్నా ఎక్కువ కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

modi national address
జాతినుద్దేశించి మోడీ ప్రసంగం
author img

By

Published : Mar 24, 2020, 9:04 PM IST

Updated : Mar 24, 2020, 9:17 PM IST

ఈ రోజు అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. వైరస్​ వ్యాప్తి అడ్డుకోవాలంటే ఈ తరహా చర్యలు అనివార్యమన్నారు.

అర్ధరాత్రి నుంచి లాక్​డౌన్​: మోదీ

"ఈ అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నాం. 21 రోజులపాటు ఆంక్షలు కొనసాగుతుంది. ఈ లాక్‌డౌన్ నిర్ణయం.. ప్రతి ఇంటికీ లక్ష్మణరేఖ లాంటిది. కరోనా నివారణలో రానున్న 21 రోజులు చాలా కీలకం. కరోనాను అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకుంటే తర్వాత మనచేతుల్లో ఏమీ ఉండదు. ఇంటినుంచి బయటకు వెళ్లాలనే యోచన కొన్నాళ్లపాటు మానుకోండి."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఏం జరిగినా..

దేశంలో ఏం జరిగినా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని.. చేతులు జోడించి వేడుకుంటున్నట్లు చెప్పారు మోదీ. ప్రధాని నుంచి గ్రామీణుల వరకు సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించి కరోనాపై పోరాటానికి మన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రాణాల కన్నా ఎక్కువనా?

21 రోజుల పాటు విధించే ఈ లాక్‌డౌన్‌.. మన ప్రాణాల కంటే ఎక్కువ కాదని ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారిని భారత్ సమర్థంగా ఎదుర్కొంటుందనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత ప్రమాదకరంగా విస్తరిస్తోందన్న విషయాన్ని మోదీ ఉదహరించారు.

సూచనలు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటించాలని మోదీ సూచించారు. పుకార్లు, వదంతులు నమ్మవద్దని.. వైద్యుల సలహా లేకుండా మందులు తీసుకోవద్దని కోరారు.

వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారని మోదీ అన్నారు. పోలీసులు, మీడియా ప్రతినిధులు 24 గంటలు పనిచేస్తున్నారని.. వారి క్షేమం కోసం ప్రార్థిద్దామని పిలుపునిచ్చారు.

రూ.15 వేల కోట్లు..

ప్రజల సమస్యలపైనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని.. నిత్యావసరాలన్నీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామన్నారు ప్రధాని. వైద్య సదుపాయాల కోసం రూ.15 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మోదీ.

ఒక్కటిగా నిలిచి..

సంకట సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలిచిందని.. భారతీయులు జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సామాజిక దూరం పాటించటమే మార్గమని తెలిపారు. ఈ విధంగా ఉంటే తప్ప ఈ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి లేదని.. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో నిలిచిపోయాయన్నారు.

ఇదీ చదవండి: కరోనా నిర్ధరణకు దేశీయంగా పరీక్ష కిట్ తయారీ

Last Updated : Mar 24, 2020, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.