ETV Bharat / bharat

'బ్రహ్మోస్ సూపర్​సోనిక్'ను పరీక్షించనున్న భారత్​

పాకిస్థాన్​, చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో తన శక్తి సామర్థ్యాలేంటో పొరుగు దేశాలకు చాటి చెప్పాలని భారత్​ భావిస్తోంది. త్రివిధ దళాలతో హిందూ మహాసముద్రంలో బ్రహ్మోస్​ సూపర్​సోనిక్ క్రూజ్​ క్షిపణిని పరీక్షించేందుకు సిద్ధమవుతోంది. నవంబర్​ చివర్లో పలుమార్లు అత్యంత శక్తిమంతమైన ఈ క్షిపణి వ్యవస్థను పరీక్షించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

India to carry out multiple launches of BrahMos supersonic cruise missiles by month-end
పొరుగు దేశాలకు తన శక్తిసామర్థ్యాలేంటో చూపనున్న భారత్​
author img

By

Published : Nov 16, 2020, 5:44 PM IST

భారత రక్షణ, పరిశోధన సంస్థ(డీఆర్​డీఓ) రూపొందించిన వాటిలో అత్యంత శక్తిమంతమైంది బ్రహ్మోస్ సూపర్​సోనిక్ క్రూజ్ క్షిపణి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆపరేషన్​ నిర్వహించగల సామర్థ్యం ఉండటం దీని ప్రత్యేకత. గతంలో 298 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణి సామర్థ్యాన్ని.. ఇటీవలే 450కి.మీకు పెంచింది డీఆర్​డీఓ.

ప్రస్తుతం చైనా, పాకిస్థాన్​తో సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో తన సత్తా ఏంటో శత్రు దేశాలకు చూపాలని భావిస్తోంది భారత్​. ఇందులో భాగంగానే హిందూ మహాసముద్రంలో ఈ నెల చివరి వారంలో బ్రహ్మోస్ సూపర్​సోనిక్ క్రూజ్ క్షిపణితో పలు పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. భారత త్రివిధదళాల సారథ్యంలో వీటిని చేపట్టనుంది.

నవంబర్​ నెల చివరి వారంలో ఈ ప్రయోగాలు జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఫలితంగా బ్రహ్మోస్​ సూపర్​సోనిక్ క్రూజ్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలవుతుందని పేర్కొన్నాయి.

కొత్తగా అభివృద్ధి చేసిన వాటితో పాటు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న క్షిపణి వ్యవస్థలను గత రెండు నెలల్లో విజయవంతంగా పరీక్షించింది డీఆర్​డీఓ. 800కి.మీ సుదూర లక్ష్యాలను ఛేదించగల శౌర్య క్షిపణి వ్యవస్థను కూడా పరీక్షించింది. సుకోయ్-30 యుద్ధ విమానం, బ్రహ్మోస్ సూపర్​సోనిక్​ క్షిపణిలను బంగాళాఖాతంలో ప్రయోగించి సఫలీకృతమైంది.

గల్వాన్​ లోయ ఘటన అనంతరం చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దులో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థతో యుద్ధవిమానాలను సైన్యం ఇప్పటికే మోహరించింది​. భారత నావికా దళం గత నెలలో ఐఎన్​ఎస్​ చెన్నై యుద్ధనౌక నుంచి ఈ క్షిపణి సామర్థ్యాన్ని పరీక్షించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.