ETV Bharat / bharat

కర్తార్‌పూర్‌ అంశంపై పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు - కర్తార్​పూర్ మేనేజ్​మెంట్​ సిక్కుయేతర వర్గానికి

పాక్​లోని కర్తార్​పూర్​ సాహిబ్ గురుద్వారా యాజమాన్యం మార్పు అంశాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై పాక్ హైకమిషన్​ ఉన్నత స్థాయి అధాకారులకు సమన్లు జారీ చేసింది.

India summons Pak CDA
కర్తార్​పూర్ యాజమాన్య మార్పుపై తీవ్రంగా స్పందించిన భారత్
author img

By

Published : Nov 7, 2020, 6:58 AM IST

పాక్‌ హైకమిషన్ ఉన్నత స్థాయి అధికారులకు భారత్‌ సమన్లు జారీ చేసింది. పాక్‌లోని చారిత్రక కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా యాజమాన్యం మార్పు అంశాన్ని తీవ్రంగా ఖండించిన కేంద్ర విదేశాంగ శాఖ‌‌.. పాకిస్థాన్‌ హైకమిషన్‌ అధికారికి శుక్రవారం సమన్లు ఇచ్చింది. దీనితో దిల్లీలోని సౌత్‌ బ్లాక్‌కు పాక్‌ దౌత్యవేత్త చేరుకున్నారు.

పాక్‌లోని కర్తార్‌పుర్‌ సాహిబ్‌ గురుద్వారా యాజమాన్య, నిర్వహణ బాధ్యతలను పాక్‌ ప్రభుత్వం ఏకపక్షంగా మార్చాలనుకుంటోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలు చూస్తున్న పాకిస్థాన్‌ సిక్కు గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ నుంచి సిక్కుయేతర సంస్థ అయిన కాందిశీకుల ఆస్తుల ట్రస్టు బోర్డుకు బదలాయించాలని నిర్ణయించింది. దీనిపై భారత్‌లోని సిక్కు సంఘాలతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తీవ్రంగా స్పందించాయి. సిక్కుల మత విశ్వాసాలకు వ్యతిరేకంగా, మైనార్టీల హక్కులను హరించేలా పాక్‌ నిర్ణయం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సిక్కు సమాజంతో చర్చించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ మండిపడుతున్న విషయం తెలిసిందే.

ఇదీ చూడండి:'భారత వాయుసేన వల్లే దూకుడు తగ్గించిన చైనా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.