ETV Bharat / bharat

'రానున్న 6 నెలలు భారతీయులకు నరకమే'

రానున్న 6 నెలలు భారతీయులు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటారని అన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. కరోనాతో పాటు ఆర్థికంగా ఎదురయ్యే వినాశనాన్నీ అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అయితే మోదీ ప్రభుత్వం తన హెచ్చరికలను పట్టించుకోవట్లేదన్నారు.

India should prepare not just for fighting coronavirus but also for economic devastation: Rahul
'రానున్న 6 నెలలు భారతీయులకు నరకమే'
author img

By

Published : Mar 17, 2020, 2:51 PM IST

కరోనా వైరస్​తో పాటు ఆర్థికపరంగా ఎదురయ్యే వినాశనాన్ని ఎదుర్కొనేందుకు భారతీయులు సిద్ధంగా ఉండాలని సూచించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. తాను ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫలితంగా రానున్న 6 నెలల పాటు ప్రజలు తీవ్ర కష్టాన్ని ఎదుర్కొంటారన్నారు.

'రానున్న 6 నెలలు భారతీయులకు నరకమే'

"నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నా(ఆర్థిక అంశంపై). అయినా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఏం చేయాలనే దానిపై వారికే స్పష్టత లేదు. భారత్​ అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. కరోనాపైనే కాదు.. ఆర్థికపరంగా మనకు ఎదురయ్యే వినాశనాన్ని ఎదుర్కవడానికీ సిద్ధంగా ఉండాలి. దీని గురించి నేను పదే పదే చెప్తూనే ఉన్నా. కానీ నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. రానున్న 6 నెలల్లో మన ప్రజలు ఊహించని రీతిలో బాధను అనుభవించబోతున్నారు. ఈ విషయం చెప్పడానికి నేను ఎంతో బాధపడుతున్నా."

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

'తమిళ ప్రజలకు అవమానం...'

మంగళవారం లోక్​సభలో జీరో అవర్ సమయంలో ప్రాంతీయ భాషకు సంబంధించిన సమస్యలపై ఎంపీలు ప్రశ్నించడానికి ప్రయత్నించారు. అయితే స్పీకర్​ తమకు అనుమతినివ్వలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్​, డీఎంకే, ఎన్​సీపీ పార్టీలు దిగువ సభ నుంచి వాకౌట్​ చేశాయి.

ఈ వ్యవహారంపై రాహుల్​ గాంధీ స్పందించారు. ఎంపీలను ప్రశ్నలు అడగనివ్వకుండా అడ్డుకోవడం వల్ల తమిళ ప్రజలను అవమానించారని ఆరోపించారు. ఎంపీలను అడ్డుకున్నా.. తమిళనాడు ప్రజలకున్న హక్కులను హరింపజేయలేరని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- పార్లమెంట్​లో రాహుల్ ప్రశ్నకు భాజపా స్ట్రాంగ్​ పంచ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.