ETV Bharat / bharat

'పరీక్షల సంఖ్య పెరిగితేనే కరోనా కట్టడి సాధ్యం'

దేశంలో ఎంత ఎక్కువ మందిని పరీక్షిస్తే అంత త్వరగా కరోనాపై విజయం సాధించగలమని నిపుణులు చెబుతున్నారు. మిగతా దేశాలతో పోలిస్తే వైరస్​ నిర్ధరణ పరీక్షల్లో భారత్​ వెనుకబడి ఉందని, కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే పరీక్షల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

VIRUS-TESTS-EXPERTS
కొవిడ్- 19 టెస్ట్
author img

By

Published : Apr 16, 2020, 9:23 AM IST

దేశంలో కఠినంగా లాక్​డౌన్​ అమలవుతున్నా కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీన్ని నిరోధించాలంటే నిర్ధరణ పరీక్షల సంఖ్య మరింత పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు.

భారత్​ సరైన చర్యలు తీసుకుంటున్నా.. ఇవి సరిపోవని ఫరీదాబాద్​ ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రి వైద్యుడు రవిశంకర్ ఝా అభిప్రాయపడ్డారు.

"మన దేశంలో జనాభా చాలా ఎక్కువ. వైరస్ నిర్ధరణ పరీక్షల సంఖ్య చాలా పెరగాలి. వైరస్ సోకే అవకాశమున్న వారిని త్వరగా గుర్తించాలి. అప్పుడే వారి నుంచి ఇతరులకు సంక్రమించకుండా నియంత్రించగలుగుతాం."

- డాక్టర్ రవిశంకర్ ఝా, ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆస్పత్రి

దేశంలో కరోనా కేసుల సంఖ్య 12వేలు దాటింది. వైరస్ ధాటికి 414 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) గణాంకాల ప్రకారం ఏప్రిల్ 14 వరకు 2,44,893 శాంపిళ్లను పరీక్షించారు.

అగ్రరాజ్యాలతో పోలిస్తే..

కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 31 లక్షల శాంపిళ్లను పరీక్షించారు. అంటే 10 లక్షల మంది జనాభాలో 9,367 మందికి పరీక్షలు చేశారు. అదే భారత్​లో చూస్తే ఈ నిష్పత్తి 177 మందికే పరిమితమైంది. స్పెయిన్, ఇటలీ దేశాలు కూడా కరోనా నిర్ధరణ పరీక్షల్లో చాలా ముందున్నాయి. స్పెయిన్​లో 6 లక్షలు, ఇటలీలో 10 లక్షలకుపైగా శాంపిళ్లను పరీక్షించారు.

క్రమంగా సంఖ్య పెరుగుతున్నా..

130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ సంఖ్య చాలా చిన్నదని నిపుణులు అంటున్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఈ స్థాయి పరీక్షలు సరిపోవని అభిప్రాయపడుతున్నారు. మార్చి 28 వరకు 27,688 శాంపిళ్లను పరీక్షించగా 7,038 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది.

క్రమంగా పరీక్షల సంఖ్య పెరుగుతున్నా.. అవి ఏ మాత్రం సరిపోవని చెబుతున్నారు నిపుణులు. ఎంత ఎక్కవ మందికి పరీక్షలు నిర్వహిస్తే కరోనాను గెలిచే అవకాశం అంతలా పెరుగుతుందని శ్రీ గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు అరవింద్ కుమార్ అన్నారు.

"మనం ఇంకా రెండో దశలోనే ఉన్నాం. ఇప్పుడిప్పుడే ప్రజలు భౌతిక దూరం, శుభ్రత, తుమ్మటం వంటి విషయాలపై అవగాహన పెంచుకుంటున్నారు. దేశంలో పరీక్షల సంఖ్య పెరుగుతున్నా కొద్ది.. కేసులు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. అందువల్ల పరీక్షల సంఖ్య మరింత పెరిగితేనే బాధితుల్ని త్వరగా గుర్తించి వేరు చేయగలం. అప్పుడే కరోనాపై విజయం సాధిస్తాం."

- డాక్టర్ రాజేశ్ చావ్లా, అపోలో ఆసుపత్రి

ఇదీ చూడండి: ' మహారాష్ట్ర కచ్చితంగా కరోనా ప్రమాదంలో ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.