ETV Bharat / bharat

భార్యాభర్తల మధ్య భారత్​-పాక్ సరిహద్దు - భారత్​-పాక్

సాధారణంగా పెళ్లయ్యాక వధూవరులిద్దరూ కలిసి మెట్టినింట అడుగుపెడతారు. కానీ రాజస్థాన్​లోని మహేంద్రసింగ్​ మాత్రం భార్యను పాకిస్థాన్​లోనే వదిలేసి ఒక్కడే ఇంటికి చేరుకున్నాడు. భార్యను తీసుకొద్దామని 2 నెలలు అత్తారింట్లోనే ఎదురుచూసినా, అతనికి నిరాశే మిగిలింది.

పాక్​ భార్యకు వీసా లేదని..
author img

By

Published : Jul 4, 2019, 7:23 PM IST

Updated : Jul 4, 2019, 7:58 PM IST

పాక్​ భార్యకు వీసా రాలేదనే బాధలో.

పాకిస్థానీ అమ్మాయి చాగన్ కన్వర్​ని పెళ్లి చేసుకున్నాడు రాజస్థాన్​కు చెందిన మహేంద్రసింగ్​. కానీ ఆమెను అక్కడే వదిలేసి రావాల్సి వచ్చింది. అమ్మాయి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా సార్వత్రిక ఎన్నికల కారణంగా మంజూరు కాలేదు. పెళ్లై 2 నెలలయినా తన భార్యకు భారత ప్రభుత్వం వీసా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పాకిస్థాన్​లో తక్కువ సంఖ్యలో హిందువులు ఉంటారు. అందుకే వారు వధూవరుల కోసం భారత్​ వైపు ఎదురు చూస్తారు. మహేంద్రసింగ్​​-చాగన్​ల సంబంధమూ అలా కుదిరిందే. మార్చి 8న జరగాల్సిన వారి పెళ్లి, పుల్వామా ఘటనతో వాయిదా పడింది. దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల ఇరు కుటుంబాలు పెళ్లిని వాయిదా వేసుకున్నాయి. ఎట్టకేలకు ఏప్రిల్​ 16న పాక్​ అమర్​కోట్​లో ఇరువురికి పెళ్లయ్యింది.

పుల్వామా దాడుల కారణంగా మొదట పెళ్లి వాయిదా పడింది. అంతా సర్దుమణిగాక పెళ్లి చేసుకున్నాం. తర్వాత 2-3 నెలలు అక్కడే ఉన్నాను. పాకిస్థాన్​లో ఉన్న ఓ హిందూ వంశానికి వరుడు కావాలంటే భారత దేశానికే రావాలి. కానీ, వాళ్లకు వీసా దొరకట్లేదు. _మహేంద్రసింగ్​, వరుడు.

పెళ్లికూతురుతోనే భారత దేశంలో అడుగు పెట్టాలనుకున్న అతడు 2 నెలలు అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో రెండు సార్లు అతని వీసాను పొడగించుకున్నాడు. ఎంతకీ భారత ప్రభుత్వం చాగన్​కు వీసా మంజూరు చేయకపోవడం వల్ల ఒక్కడే ఇంటికి చేరుకున్నాడు.

వీసా విషయమై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్​ను కలిసి విన్నవించుకున్నా లాభం లేకపోయింది. పెళ్లి కూతుర్ని తీసుకురాలేదని బంధువులు బాధ పడుతున్నారు. _మహేంద్రసింగ్​, వరుడు.

దేశాలు వేరైనా మనసులు కలిసిన వారిని సరిహద్దు నియమాలు దూరం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిచాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురిని స్వాగతించడానికి ఊరంతా వేచి చూసింది. వధువు లేకుండా వరుడు రావడంతో గ్రామస్థులు నిరాశ చెందారు.వీలైనంత త్వరగా వీసా ఇప్పించాలని మోదీ సర్కారు వేడుకుంటున్నాము._వరుడి బంధువు

ఇదీ చూడండి: ట్వీట్​తోనే పర్యటకుల సమస్యల పరిష్కారం!

Dibrugarh (Assam), July 04 (ANI): Two people died and 3 people received injuries in a clash at AMC road of Assam's Dibrugarh. The clash took place between a biker and a car driver. Injured people are undergoing treatment at a hospital. Police and security forces are deployed in the area.
Last Updated : Jul 4, 2019, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.