ETV Bharat / bharat

'వీలైనంత త్వరగా సరిహద్దు సమస్యకు పరిష్కారం' - India China maintaining engagements

భారత్​-చైనా మధ్య సరిహద్దు వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీ వాత్సవ. రెండు దేశాలు దౌత్య, సైనిక స్థాయిలో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

India, China maintaining engagements to resolve eastern Ladakh row at earliest: MEA
'వీలైనంత త్వరగా సరిహద్దు సమస్య పరిష్కారం'
author img

By

Published : Jun 11, 2020, 9:05 PM IST

తూర్పు లద్దాఖ్​లో సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్​-చైనాలు దౌత్య, సైనిక సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీ వాత్సవ. ఇరు దేశాల నాయకుల మార్గదర్శకాలకు అనుగుణంగా సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఓ ఒప్పందానికి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

లద్దాఖ్​ సరిహద్దులో గాల్వన్​ లోయ, హాట్ స్ప్రింగ్ సహా పలు ప్రాంతాల్లో భారత్​, చైనాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నాయనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు శ్రీ వాత్సవ. సరిహద్దులో ప్రశాంత వాతావరణం ఉంటేనే భారత్​-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని స్పష్టం చేశారు.

సైన్యం అధికారిక వర్గాలు మాత్రం సరిహద్దులో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్నట్లు తెలిపాయి. చైనా దళాలు 1.5కి.మీ వెనక్కి వెళ్లినట్లు పేర్కొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.