ETV Bharat / bharat

కాంగ్రెస్​లో సమూల‌ ప్రక్షాళన! ఆజాద్​ పదవులకు కోత - కాంగ్రెస్‌ ప్రక్షాళన! కొందరికి అందలం, కొందరిపై వేటు

కాంగ్రెస్‌లో సమూల ప్రక్షాళనకు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉపక్రమించారు. పలువురు సీనియర్లను పదవుల నుంచి తప్పించారు. అధ్యక్షురాలికి సంస్థాగత సహాయకులుగా ఆరుగురిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీడబ్ల్యూసీ సభ్యులుగా చిదంబరం, జితేంద్రసింగ్‌, తారిఖ్‌ అన్వర్‌, సూర్జేవాలాలను ఎంపిక చేశారు. యూపీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలిగా ప్రియాంకా గాంధీ, తెలంగాణ ఇన్‌ఛార్జిగా మాణిక్యం ఠాకూర్‌లను నియమించారు.

In Congress Shake-Up, Team Rahul Scores, Ghulam Nabi Azad Loses Post
కాంగ్రెస్‌ ప్రక్షాళన! కొందరికి అందలం, కొందరిపై వేటు
author img

By

Published : Sep 12, 2020, 7:20 AM IST

వరుస ఓటములు, అంతర్గత సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌లో సమూల ప్రక్షాళనకు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉపక్రమించారు. పలువురు సీనియర్లను పదవుల నుంచి తప్పించారు. పార్టీ అధినాయకత్వంపై లేఖాస్త్రం సంధించిన అగ్రనేతల్లో ముఖ్యుడైన గులాం నబీ ఆజాద్‌ ప్రాధాన్యాన్ని తగ్గించేశారు. ఆయన పదవులకు కోత పెట్టారు. కీలక నిర్ణయాల విభాగం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)నీ సోనియా పునర్‌వ్యవస్థీకరించారు. ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జులను మార్చివేశారు. పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీని ఏర్పాటు చేశారు. సంస్థాగత వ్యవహారాల్లో తనకు సహాయం అందించేందుకు ఆరుగురు నేతలతో కమిటీని నియమించారు. పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ప్రియాంకా గాంధీకి పూర్తి బాధ్యతలు అప్పగించారు. పార్టీ పగ్గాలు క్రియాశీల నేతకు ఇవ్వాలంటూ గత నెలలో 23 మంది సీనియర్‌ నేతలు లేఖ రాయడం, 24న నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించడంతోనే పార్టీ విభాగాల్లో మార్పులుంటాయనే ప్రచారం జోరందుకుంది.

నాటి సమావేశంలో సీనియర్లపై విమర్శలు వెల్లువెత్తినా సంపూర్ణ అధికారం పార్టీ అధ్యక్షురాలికే సమావేశం కట్టబెట్టింది. ఈ క్రమంలో సోనియాగాంధీ శుక్రవారం రాత్రి సీడబ్ల్యూసీతో పాటు పలు విభాగాల్లో మార్పులు చేర్పులు చేశారు.

సీడబ్ల్యూసీకే ఆజాద్‌ పరిమితం..

22 మంది శాశ్వత సభ్యులతో ఉండే సీడబ్ల్యూసీలో నలుగురిని తొలగించి కొత్తగా నలుగురిని తీసుకున్నారు. లేఖాస్త్రాన్ని సంధించిన సీనియర్లలో ముఖ్యుడైన గులాంనబీ ఆజాద్‌ను సీడబ్ల్యూసీకి పరిమితం చేశారు. ప్రధాన కార్యదర్శి, హరియాణా ఇన్‌ఛార్జి పదవుల నుంచి ఆయనను తప్పించారు. శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, జితేంద్రసింగ్‌, తారిఖ్‌ అన్వర్‌, రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలాను సీడబ్ల్యూసీ సభ్యులుగా నియమించారు. పశ్చిమ్‌ బెంగాల్‌ పీసీసీ అధ్యక్షునిగా నియమితులైన అధీర్‌ రంజన్‌ చౌధురిని సీడబ్ల్యూసీ సభ్యుడి హోదా నుంచి శాశ్వత ఆహ్వానితుడిగా బదిలీ చేశారు. వయోభారం, ఇతర కారణాలతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మోతీలాల్‌ వోరా, తామ్రధ్వజ్‌ సాహు, గోవా మాజీ ముఖ్యమంత్రి లిజినో ఫెలిరోలను సీడబ్ల్యూసీ నుంచి తప్పించారు. సీడబ్ల్యూసీలో గతంలో 16 మంది శాశ్వత ఆహ్వానితులుగా ఉండగా ఆ సంఖ్యను 26కు పెంచారు. గతంలో శాశ్వత ఆహ్వానితుల జాబితాలో ఉన్న గౌరవ్‌ గొగోయి, పి.సి.చాకో, ఆశా కుమారి, ఆర్‌.సి.కుంతియా, అనురాగ్‌ నారాయణ్‌ సింగ్‌లను తొలగించారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి కె.హెచ్‌.మునియప్పను తాజాగా శాశ్వత ఆహ్వానితునిగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో 9 మందిని నియమించగా అందులో కొత్తగా కుల్‌దీప్‌ బిష్ణోయ్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ చోటు దక్కించుకున్నారు. ఐఎన్‌టీయూసీ అంతర్జాతీయ అధ్యక్షుడి హోదాలో ప్రత్యేక ఆహ్వానితునిగా జి.సంజీవరెడ్డిని కొనసాగించారు.

అధ్యక్షురాలికి సహాయకులుగా..

పార్టీ సంస్థాగత, కార్యక్రమాల నిర్వహణలో అధ్యక్షురాలికి సహాయకులుగా ఆరుగురితో ప్రత్యేక కమిటీని నియమించారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రులు ఏ.కె.ఆంటోనీ, అంబికా సోనీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌, అహ్మద్‌ పటేల్‌, ముకుల్‌ వాస్నిక్‌, రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా ఉన్నారు.

ప్రధాన కార్యదర్శుల సంఖ్య కుదింపు

గతంలో 11 మంది ప్రధాన కార్యదర్శులుగా ఉండగా ఆ సంఖ్యను తొమ్మిది మందికి కుదించారు. గతంలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న మోతీలాల్‌ వోరా, అంబికా సోనీ, గులాంనబీ ఆజాద్‌, లిజినో ఫెలిరో, మల్లికార్జున ఖర్గేలను తొలగించి కొత్తగా తారీఖ్‌ అన్వర్‌, రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా, జితేందర్‌ సింగ్‌లకు చోటు కల్పించారు. హరియాణా, జమ్మూ-కశ్మీర్‌, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల ఇన్‌ఛార్జులు ఉన్న గులాంనబీ ఆజాద్‌, అంబికా సోనీ, లిజినో ఫెలిరోలను తొలగించి వారి స్థానంలో వివేక్‌ బన్సల్‌, హెచ్‌.కె.పాటిల్‌, మణిష్‌ ఛాత్రా, కుల్జీత్‌ సింగ్‌లను నియమించారు.

అయిదుగురితో కేంద్ర ఎన్నికల అథారిటీ

పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీని పునర్‌వ్యవస్థీకరించారు. మధుసూదన్‌ మిస్త్రీ ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో రాజేష్‌ మిశ్ర, కృష్ణ బైరేగౌడ, జ్యోతిమణి సెన్నిమలై, అర్విందర్‌ సింగ్‌ లవ్లీలను సభ్యులుగా నియమించారు.

సూర్జేవాలాకు పెద్ద పీట...

ఏఐసీసీ అధికార ప్రతినిధిగా, రాహుల్‌ గాంధీ సన్నిహితునిగా ఉన్న రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలాకు పదవుల్లో పెద్దపీట దక్కింది. గతంలో సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితునిగా ఉన్న ఆయన ఆ కమిటీలో సభ్యునిగా ప్రమోషన్‌ పొందడంతో పాటు అధ్యక్షురాలికి సహాయంగా నియమించిన కమిటీలోనూ స్థానం దక్కించుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా, కర్ణాటక రాష్ట్ర ఇన్‌ఛార్జిగా కూడా నియమితులయ్యారు. బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మైనారిటీ నేత తారీఖ్‌ అన్వర్‌కు కమిటీల్లో ప్రాధాన్యం దక్కింది. సీడబ్ల్యూసీ సభ్యునిగా, ప్రధాన కార్యదర్శిగా, కేరళ, లక్షదీవుల ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. లేఖ రాసిన వారిలో ఆజాద్‌ అధికారాలకు కత్తెర పడగా.. ముకుల్‌ వాస్నిక్‌ను మాత్రం అన్ని పదవుల్లో కొనసాగించడం గమనార్హం.

కుంతియాపై వేటు.. మాణిక్యం ఠాకూర్‌కు అప్పగింత

In Congress Shake-Up, Team Rahul Scores, Ghulam Nabi Azad Loses Post
మాణిక్యం ఠాకూర్‌

ప్రధాన కార్యదర్శులతో పాటు పలు రాష్ట్రాల ఇన్‌ఛార్జులను మార్చివేశారు. తెలంగాణ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న రామచంద్ర కుంతియాను తప్పించి ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన విరుద్‌నగర్‌ ఎంపీ మాణిక్యం ఠాకూర్‌ను నియమించారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పేలవమైన పనితీరుతోనే కుంతియాపై వేటుపడినట్లు తెలిసింది. కుంతియాను రాష్ట్ర ఇన్‌ఛార్జితో పాటు సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితునిగానూ తప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ఉమెన్‌ చాందీని ఇన్‌ఛార్జిగా కొనసాగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.