ETV Bharat / bharat

పాక్​ నుంచి వలస వచ్చి స్థానిక​ ఎన్నికల్లో పోటీ - పాకిస్థాన్ మహిళ

పాకిస్థాన్​ నుంచి వలస వచ్చిన మహిళ రాజస్థాన్​ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. 4 నెలల క్రితం భారత పౌరసత్వం పొందిన ఆమె.. సర్పంచ్​గా పోటీ చేసేందుకు అర్హురాలు అయ్యారు. చదువు, మంచి జీవితం కోసమే భారత్​కు వలస వచ్చానని చెబుతున్నారు నీతా కన్వార్​.

pak immigrant
pak immigrant
author img

By

Published : Jan 17, 2020, 10:32 AM IST

Updated : Jan 17, 2020, 1:31 PM IST

పాక్​ నుంచి వలస వచ్చి స్థానిక​ ఎన్నికల్లో పోటీ

నీతా కన్వార్​.. చదువుతో పాటు పెళ్లి చేసుకోవాలని పాకిస్థాన్​ సింధ్​ నుంచి 18 ఏళ్ల క్రితం రాజస్థాన్​కు వలస వచ్చారు. 4 నెలల క్రితం భారత పౌరసత్వాన్ని పొందారు. ఇప్పుడు ఏకంగా రాజస్థాన్​లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

"12వ తరగతి వరకు పాకిస్థాన్​ సింధ్​లో చదువుకున్నా. తర్వాత ఆజ్మేర్​లో బీఏ చదివా. నేను పాక్​ నుంచి వచ్చి 18 ఏళ్లు అవుతోంది. 8 ఏళ్ల క్రితం పుణ్య ప్రతాప్​ కరణ్​ను పెళ్లి చేసుకున్నా. 4 నెలల క్రితం పౌరసత్వం లభించింది. ఇప్పుడు సర్పంచ్​ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.

ఇక్కడి రాజ్​పుత్​ సంస్కృతి సంప్రదాయాలు నాకు నచ్చాయి. విద్య విషయంలో మహిళలకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడివారు నన్నెంతో బాగా చూసుకుంటారు. అందుకే పోటీలో నిలుచున్నా. మా మామయ్య 3 సార్లు సర్పంచ్​గా పనిచేశారు. ఆయన ప్రోత్సాహంతోనే ఇప్పుడు పోటీ చేస్తున్నా. ఆయనే నాకు మార్గదర్శి."

-నీతా కన్వార్​

ప్రతాప్​ను పెళ్లి చేసుకున్న తర్వాత టోంక్​ జిల్లా నట్వారాలో నివాసం ఉంటున్నారు 36 ఏళ్ల నీతా. ఆమె రాజ్​పుత్​ వర్గానికి చెందిన వారు. ఈ వర్గానికి చెందినవారు వివాహాల కోసం భారత్​కు, ముఖ్యంగా జోధ్​పుర్​కు ఎక్కువగా వస్తారు.

పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర దుమారం నేపథ్యంలో నీతా కథ చర్చనీయాంశమైంది. చదువుకోవాలనుకున్న వారికి, భారత్​లో మంచి జీవితం గడపాలనుకున్న వారికి సీఏఏ ఎంతో ఉపయోగకరమని చెబుతున్నారామె.

ఇదీ చదవండి: 'ఇందిర-కరీం' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన రౌత్

Tonk (Rajasthan), Jan 17 (ANI): Neeta Sodha, an immigrant from Pakistan who was recently given Indian citizenship is contesting panchayat elections in Natwara. Speaking to media, she said, "I came to India 18 yrs back but I was given nationality just 4 months ago. My father-in-law guides me in my political journey."

Last Updated : Jan 17, 2020, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.