కర్ణాటక బెళగావిలో దారుణం జరిగింది. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, అడ్డొచ్చిన ఆమె భర్తను కడతేర్చాడో ఉన్మాది.
బెళగావి జిల్లా అథని మండలం సత్తి గ్రామంలో నివసిస్తాడు మహాంతేశ్ పుండలిక్ గైక్వాడ్. కొద్దిరోజులగా మహారాష్ట్ర జట్టా తాలూకా ధారేబడచి గ్రామానికి చెందిన.. గంగయ్య సిద్ధయ్య స్వామి(32) భార్య.. శోభ స్వామితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి బంధాన్ని ప్రశ్నించినందుకు గంగయ్యను చంపి బావిలో పడేశాడు మహాంతేశ్.
ఏప్రిల్ 30 నుంచి తన భర్త కనిపించట్లేదని మే 5న అథని పోలీసులకు ఫిర్యాదు చేసింది శోభ. గంగయ్య కోసం వెతికే క్రమంలో.. పోలీసులకు బావిలో మృతదేహం దొరికింది. నిందితులు మహాంతేశ్ సహా... అథని పట్టణానికి చెందిన రాహుల సంజయ షిండే, రాదేరహట్టి గ్రామానికి చెందిన విజయ జ్ఞానేశ్వర్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.
ఇదీ చదవండి: నది ఒడ్డున ఇసుకలోనే ప్రసవ వేదన