ETV Bharat / bharat

ఆ మందును వారు మాత్రమే తీసుకోవాలి: ఐసీఎంఆర్​ - హైడ్రాక్సీ క్లోరోక్విన్

హైడ్రాక్సిక్లోరోక్విన్ వినియోగంపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనాపై పోరాడుతోన్న ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బంది ఈ మందును వినియోగించవచ్చని సూచించింది. అయితే 15 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ముందు జాగ్రత్తగా హెచ్​సీక్యూను వాడకూడదని స్పష్టం చేసింది.

ICMR issues revised advisory on use of hydroxychloroquine
హెచ్​సీక్యూ వాడకంపై ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాలు
author img

By

Published : May 23, 2020, 11:09 AM IST

Updated : May 23, 2020, 2:16 PM IST

కరోనా వైరస్​ సోకకుండా వైద్య సిబ్బంది ముందుజాగ్రత్తగా తీసుకుంటున్న హైడ్రాక్సీక్లోరోక్విన్​ (హెచ్​సీక్యూ) మాత్రలను కంటెయిన్​మెంట్​ జోన్లలో పనిచేసే పోలీసులు, పారామిలటరీ సిబ్బందికి కూడా ఇవ్వాలని ఐసీఎంఆర్​ సిఫార్సు చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎవరికి ఈ మందు ఇవ్వొచ్చు, ఎవరికి ఇవ్వకూడదన్నది అందులో సవివరంగా పేర్కొంది.

ఇంతకు ముందు.. కరోనా నియంత్రణ కోసం ముందు జాగ్రత్తగా ఆరోగ్య కార్యకర్తలు, కరోనా పాజిటివ్ వ్యక్తులతో సంబంధమున్న వారు ఈ ఔషధాన్ని వాడొచ్చని తెలిపింది. అయితే తాజాగా ఆ మార్గదర్శకాల్లో మార్పులు చేసింది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ కేర్​ సర్వీస్​ (డీజీహెచ్​ఎస్​) అధ్వర్యంలో జాయింట్ మానిటరింగ్ గ్రూప్, ఎయిమ్స్, ఐసీఎంఆర్​, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్​, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సమీక్షించిన అనంతరం తాజా సిఫార్సులు చేశారు.

పనిచేయడం లేదు..

పుణెలోని ఎన్​ఐవీ నివేదిక ప్రకారం, ఇన్​-విట్రో టెస్టింగ్​లో కొవిడ్​-19ను నియంత్రించడంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ విఫలమైంది. సార్స్-కోవ్​-2​ ఆర్​ఎన్​ఏను కూడా నియంత్రించలేకపోయింది.

అందువల్ల 15 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణిలు, పాలిచ్చే తల్లులు ఈ హెచ్​సీక్యూ వాడకూడదని ఐసీఎంఆర్​ స్పష్టం చేసింది.

సైడ్ ఎఫెక్ట్స్​..

కంటి (రెటినోపతి), గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో హైడ్రాక్సీక్లోరోక్విన్​ సైడ్​ ఎఫెక్ట్ చూపుతోందని ఐసీఎంఆర్​ తెలిపింది.

హెచ్​సీక్యూ వాడిన వారిలో అరుదుగా హృదయ స్పందన రేటు తగ్గుతోందని, హృదయనాళాలపై కూడా దుష్ప్రభావం చూపుతోందని వెల్లడించింది. అలాగే కంటి చూపు మందగించడం, మసకబారినట్లు అనిపించడం జరుగుతోందని... ఇలాంటి పరిస్థితిల్లో ఈ మలేరియా ఔషధాన్ని వాడడం పూర్తిగా నిలిపివేయాలని సూచించింది.

హెచ్​సీక్యూ వాడిన 1,323 మందిలో... వికారం (8.9 శాతం), కడుపునొప్పి (7.3 శాతం), వాంతులు (1.5 శాతం), హైపోగ్లైసీమియా (1.7 శాతం), హృదయ సంబంధ రుగ్మతలు (1.9 శాతం) కనిపించాయని ఐసీఎంఆర్ పేర్కొంది. అందువల్ల గుర్తింపు ఉన్న వైద్యుల సూచనల మేరకు మాత్రమే ఈ హెచ్​సీక్యూను వాడాలని స్పష్టం చేసింది.

హైడ్రాక్సీక్లోరోక్విన్ దుష్ప్రభావానికి ఎవరైనా గురైతే... వెంటనే జాతీయ మార్గదర్శకాల ప్రకారం వైద్య పరీక్షలు చేయాలి. ప్రామాణిక చికిత్స నిబంధనలు అనుసరించాలని ఐసీఎంఆర్ సూచించింది.

ఇదీ చూడండి: ఈ శానిటైజేషన్​ టిప్స్​తో కరోనాకు చెక్​!

ఇదీ చూడండి: 'ప్యాకేజీ'తో సామాన్యుడికి ప్రయోజనమెంత?

Last Updated : May 23, 2020, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.