ETV Bharat / bharat

ట్రేడింగ్ సంస్థ గుట్టు రట్టు- భారీగా అక్రమ సొమ్ము గుర్తింపు

author img

By

Published : Nov 12, 2020, 3:18 PM IST

చెన్నైకు చెందిన ప్రముఖ బులియన్​ ట్రేడింగ్​ సంస్థలో రూ.500 కోట్లకుపైగా పన్ను పరిధిలోకి రాని ఆదాయాన్ని గుర్తించినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. అందులో రూ.150 కోట్ల ఆదాయాన్ని ఆ సంస్థే స్వచ్ఛందంగా వెల్లడించినట్లు తెలిపింది.

I-T dept detects undisclosed income
బులియన్​ ట్రేడింగ్​ సంస్థలో ఐటీ దాడులు

చెన్నైలోని ఓ ప్రముఖ బులియన్​ ట్రేడింగ్​ సంస్థ ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. సుమారు రూ.500 కోట్లకుపైగా లెక్కించని ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) గురువారం తెలిపింది.

చెన్నై, ముంబయి, కోల్​కతా, కోయంబత్తూర్​, సేలం, తిరుచ్చి​, మధురై​, తిరునెల్వెలీలోని సంస్థ ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించింది ఆదాయ పన్ను శాఖ.

" ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.500 కోట్లకుపైగా లెక్కించని ఆదాయాన్ని గుర్తించాం. అందులో రూ.150 కోట్ల వరకు ఆ సంస్థే స్వచ్ఛందంగా వెల్లడించింది. డీలర్​ గ్రూప్​ వ్యాపారేతర పెట్టుబడులు సహా, లాభాలను తగ్గించేందుకు వసతుల పేరిట బిల్లులు రూపొందించటంపైనా దర్యాప్తు కొనసాగుతోంది."

- ఆదాయ పన్ను శాఖ.

సుమారు రూ.400 కోట్ల విలువైన 814 కిలోల అదనపు స్టాక్​ను గుర్తించినట్లు తెలిపింది సీబీడీటీ. వాటిని కూడా పన్ను పరిధిలోకి తీసుకువస్తామని ప్రకటించింది. సంస్థకు సంబంధించిన మరో ప్రాంగణంలో పన్ను పరిధిలోకి రాని.. 50 కిలోల అదనపు స్టాక్​ను గుర్తించినట్లు తెలిపింది. వాస్తవాలను దాచిపెట్టి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు పేర్కొంది. ఫోరెన్సిక్​ నిపుణులను రంగంలోకి దింపామని, లెక్కించని ఆదాయం తుది విలువను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: ఐటీ సోదాల్లో రూ.1000 కోట్ల నల్లధనం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.