భారత 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ చరిత్రను తెలిపే వెబ్‌సిరీస్ 'దేశ్ కి ధరోహర్' తొలి ఎపిసోడ్‌ను విడుదల చేసింది పార్టీ. భారత స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్ర, పార్టీ ప్రయాణంపై వెబ్‌సిరీస్ ధరోహర్ను రూపొందించారు.
ఈ సందర్భంగా తొలి ఎపిసోడ్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. రెండు నిమిషాల నిడివిగల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు 'కాంగ్రెస్ అంటేనే ఎప్పటికీ దేశం గొంతుక' అని రాసుకొచ్చారు రాహుల్.
-
कांग्रेस- एक विचारधारा जो हमेशा से है देश की आवाज़। #DeshKiDharohar pic.twitter.com/hPoP0kWMK2
— Rahul Gandhi (@RahulGandhi) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">कांग्रेस- एक विचारधारा जो हमेशा से है देश की आवाज़। #DeshKiDharohar pic.twitter.com/hPoP0kWMK2
— Rahul Gandhi (@RahulGandhi) August 15, 2020कांग्रेस- एक विचारधारा जो हमेशा से है देश की आवाज़। #DeshKiDharohar pic.twitter.com/hPoP0kWMK2
— Rahul Gandhi (@RahulGandhi) August 15, 2020
కాంగ్రెస్ వెబ్‌సిరీస్ విడుదల సందర్భంగా ఏఐసీసీ సమాచార విభాగం ఇంఛార్జి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, సోషల్ మీడియా విభాగం ఛైర్మన్ రోహన్ గుప్తా ఓ ప్రకటన విడుదల చేశారు.
" లౌకిక, ప్రజాస్వామ్య స్వభావంలో రాజీ పడకుండా.. తయారీ, వ్యవసాయం, విజ్ఞానం, సాంకేతికం, ఆరోగ్యం, సైనిక, సంస్కృతికం రంగాల్లో ప్రపంచ నాయకుడిగా భారత్‌ను నిలిపే ప్రయత్నంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. 135 ఏళ్ల భారత చరిత్రను ధరోహర్ గుర్తు చేస్తుంది. కాంగ్రెస్ ఆలోచనే, భారత్ ఆలోచన.
- కాంగ్రెస్
ఇదీ చూడండి: స్వాతంత్య్ర వేడుకలు హింసాత్మకం.. భాజపా కార్యకర్త మృతి