ETV Bharat / bharat

'సీఎం పదవా? నాకంత తొందరేం లేదు' - సీఎం పదవిపై అశోక్​ చవాన్​ స్పందన

సీఎం పదవి చేపట్టాలని తనకు ఏ మాత్రం తొందరలేదని కాంగ్రెస్​ నేత, మహారాష్ట్ర మంత్రి అశోక్​ చవాన్​ పేర్కొన్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నవారు.. ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటారని ఓ ఎన్సీపీ నేత చేసిన వ్యాఖ్యలనుద్దేశించి ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతం తామంతా సీఎం ఠాక్రేకు సానుకూలంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

I am not to hurry to become a CM, Says Ashok Chawan
'సీఎం పదవా? అబ్బే.. నాకంత తొందరేం లేదు'
author img

By

Published : Jan 23, 2021, 11:38 PM IST

ముఖ్యమంత్రి కావడంపై తనకంత తొందరేమీ లేదని కాంగ్రెస్‌ నేత, మహారాష్ట్ర మంత్రి అశోక్‌ చవాన్‌ అన్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రస్తుతం పూర్తి మద్దతుతో పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో ఎక్కువకాలం ఉన్నవారు ఎవరైనా సీఎం పదవి కోరతారంటూ ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు స్పందించారు చవాన్​. సీఎం ఉద్ధవ్​ ఠాక్రే పట్ల తామంతా సానుకూలంగా ఉన్నట్టు బోకోర్‌ పట్టణంలో నిర్వహించిన ఓ ర్యాలీలో చెప్పారు. అయితే.. సీఎం కావడంపై తనకు తొందరేమీ లేదన్నారు.

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మూడు పార్టీలు ఒక వేదికపైకి వచ్చి మహా వికాస్‌ అఘాడిగా ఏర్పడటం ద్వారా రాష్ట్రంలో భాజపాను బహిష్కరించడంలో విజయవంతమైనట్టు చెప్పారు. కొంతమంది సమస్యలు సృష్టించాలని ప్రయత్నించినా అవి విఫలమవుతాయని చెప్పారు. ఈ ప్రభుత్వం పూర్తికాలం పాటు కొనసాగుతుందని అశోక్‌ చవాన్‌ స్పష్టం చేశారు. గతంలో 2008-10 మధ్య కాలంలో మహారాష్ట్ర సీఎంగా సేవలందించారు అశోక్‌ చవాన్‌.

ఇదీ చదవండి: టీకా సమర్థతపై చర్చకు సై: అమిత్​ షా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.