ETV Bharat / bharat

కొత్త ఏడాదిలో మన నుంచి 'భూమి' కోరుకునేది ఇదే... - population growth news

నేను భూమిని.. నా సంతానం 775 కోట్లు. నాలోని సహజ వనరులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. నా ఒళ్లు వేడెక్కుతోంది. కొత్త దశాబ్దిలోనూ ఇలాగే కొనసాగితే అందరికీ ఆహారాన్ని అందించే శక్తిని కోల్పోతాను. కాబట్టి బిడ్డలూ.. కొత్త ఏడాదిలో ఇంధనాలను పొదుపుగా వాడండి. సౌర, వాయు శక్తుల్ని వినియోగించుకోంది. పచ్చని చెట్లను పెంచి పచ్చగా జీవించండి.

I am Earth .. my offspring is 775 crores
నేను భూమిని.. నా సంతానం 775 కోట్లు
author img

By

Published : Jan 1, 2020, 3:30 PM IST

పుడమిని నేను. నా మానవ సంతానం 775 కోట్లు!. క్రీస్తు శకం 1వ సంవత్సరంలో 20 కోట్ల మందే ఉండేవారు. 2020 నాటికి 38 రెట్లు పెరిగి.. 775 కోట్ల మంది అయ్యారు. 2030కి 854 కోట్లు, 2057కి 1000 కోట్లు అవుతారు. నేను జాగ్రత్తగా కూడబెట్టిన సహజ వనరులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. కవచ కుండలాలు తెగిన కర్ణుడిలా బలహీనపడిపోతున్నాను. నా ఒళ్లు వేడెక్కుతోంది. కొత్త దశాబ్దిలోనూ ఇలాగే కొనసాగితే అందరికీ ఆహారాన్ని అందించే శక్తిని కోల్పోతాను. కాబట్టి బిడ్డలూ.. కొత్త సంవత్సరంలో ఇంధనాలను పొదుపుగా వాడండి. సౌర, వాయు శక్తుల్ని హాయిగా వినియోగించుకోండి. పచ్చని చెట్లను పెంచి పచ్చగా జీవించండి.

మీ శ్రేయోభిలాషి ఐరాసని..

I am Earth .. my offspring is 775 crores
ఐరాస

రణ నీతికి స్వస్తి పలికి.. శాంతి గీతిని వినిపించే బాధ్యతల్ని ప్రపంచం నాకు అప్పగించింది. దేశాల మధ్య సుహృద్భావం, ప్రజలందరి సుఖ జీవనమే నా లక్ష్యం. కొత్త దశాబ్దంలోనూ ఆ కృషిని కొనసాగిస్తా. ప్రపంచంలో పోషకాహార లోపం ఎదుర్కొంటున్నవారు 82.1 కోట్ల మంది, నిరక్షరాస్యులు 75 కోట్ల మంది, పేదలు 73.6 కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఐదుగురి (6-17 ఏళ్ల మధ్య వయసు)లో ఒకరు బడికి వెళ్లడంలేదు. ఒక కుటుంబంలో నలుగురు బాగా ఎదిగి, నలుగురు పేదరికంలో ఉంటే తండ్రికి ఎలా ఉంటుందో? నాకూ అలానే ఉంది. అందుకే 2030 నాటికి ఈ సమస్యల పరిష్కారానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పెట్టుకొని కృషి చేస్తున్నా. మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా.

యువ భారతాన్ని

భారత్​

చైనా తర్వాత నాదే పెద్ద కుటుంబం. 136 కోట్ల మంది నా బిడ్డలు. 2030 నాటికి ప్రపంచ జనాభాలో 17.97 శాతం నా పిల్లలే ఉంటారు. వీరంతా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందితేనే సంతోషం. నా పిల్లల్లో అత్యధికులు యువతే. నా ఆశలన్నీ వారిపైనే. వారి విజయాలు భవిష్యత్తు చిత్రాన్ని మారుస్తాయని ప్రపంచమూ ఆశిస్తోంది. 1971లో 15-29 ఏళ్ల మధ్య వయసున్న నా పిల్లలు 16.8 కోట్లు. 2011 నాటికి వీరు 42.2 కోట్ల(34.8%)కు పెరిగారు. 2020కి దేశ జనాభాలో 34.33% వీరే. అనేక దేశాల మొత్తం జనాభా కంటే వీరే ఎక్కువ కావడం గొప్ప విషయమే కదా. విద్యా, ఉపాధి రంగాల్లో వెనకబడటం బాధాకరం. కొత్త దశాబ్దంలో అయిన నా పిల్లలు ఈ సమస్యను అధిగమించి, అందరూ విద్యా సంపన్నులు కావాలి..

ఇదీ చూడండి: కొత్త దశాబ్దిలోకి సుస్థిర అడుగులేద్దాం.. నవ భారతాన్ని నిర్మిద్దాం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.