ETV Bharat / bharat

సిలబస్, బోధన​ సమయం కుదింపు దిశగా కేంద్రం

దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో వచ్చే విద్యా సంవత్సరంలో సిలబస్​, బోధనా సమయాన్ని తగ్గించాలని భావిస్తోంది కేంద్రం. దీనికి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఉపాధ్యాయులు, విద్యావేత్తలను ట్విట్టర్​ వేదికగా కోరారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​.

HRD Minister Ramesh Pokhriyal says Centre is contemplating option of reducing syllabus
విద్యా సిలబస్​ను కుదించనున్న కేంద్రం
author img

By

Published : Jun 9, 2020, 3:20 PM IST

కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరం నుంచి సిలబల్​ను, బోధనా సమయాన్ని తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుత తరుణంలో విద్యార్థుల తలిదండ్రులు, అధ్యాపకుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు కేంద్ర మంత్రి రమేష్​ పోఖ్రియాల్​.

  • I would like to appeal to all teachers, academicians, and educationists to share their point of view on this matter using #SyllabusForStudents2020 on MHRD's or my Twitter and Facebook page so that we can take them into consideration while making a decision.@DDNewslive

    — Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) June 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సిలబస్​, బోధనా సమయాన్ని కుదింపునకు సంబంధించి సలహాలు, సూచనలను పంచుకోవాలని ఉపాధ్యాయులను, విద్యావేత్తలను కోరారు. వారి అభిప్రాయాలను 'హ్యాష్​ట్యాగ్​ సిలబస్​ ఫర్​ స్టూడెంట్స్​ 2020'కి ట్యాగ్​ చేయాలని సూచించారు.

అంతేకాకుండా ట్విట్టర్​, ఫేస్​బుక్​ ద్వారా కూడా అభిప్రాయాలను తెలుపొచ్చని కేంద్రమంత్రి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే సలహాలు, సూచనలను తుది నిర్ణయ సమయంలో పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి:పైపులో ఇరుక్కున్న కరోనా- కాపాడిన అగ్నిమాపక దళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.