దేశంలో రాబోయే అయిదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావారణ శాఖ(ఐఎండీ) ఆదివారం ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాలు సహా.. బంగాల్, సిక్కిం, బిహార్‌కు ఆనుకొని ఉన్న తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురవనున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఫలితంగా తూర్పు బిహార్, దాని పరిసర ప్రాంతాల్లో తుపాను సంభవించవచ్చని అంచనా వేసింది ఐఎండీ.
జులై 13న బంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన ఐఎండీ.. ఆ తరువాత క్రమేపీ తగ్గుముఖం పడతాయని స్పష్టం చేసింది. అనంతరం మహారాష్ట్రలోని ముంబయి, థానే, రాయ్‌ఘడ్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని.. ఈ వారంలో ఒకటి రెండుసార్లు ఆకాశం మేఘావృతమయ్యే అవకాశమున్నట్లు ఐఎండీ పేర్కొంది.
అక్కడ మొదలు..
పంజాబ్, హరియాణా, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో రెండురోజులుగా వర్షాలు కురిశాయని చెప్పింది ఐఎండీ. పంజాబ్‌లోని మూడు చోట్ల సుమారు 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ సీనియర్ అధికారి తెలిపారు.
కర్ణాటకలోనూ..
అయితే ఈ వర్షాల వల్ల కర్ణాటకలోని ఉత్తర, దక్షిణ కన్నడ జిల్లాలు సహా.. ఉడుపిలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరిత్య పర్యవేక్షణ కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి: ఝార్ఖండ్‌లో పిడుగులు పడి ఐదుగురు మృతి