ఉత్తరాఖండ్‌పై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రవాణా వ్యవస్థ దెబ్బతింది. అనేక గ్రామాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
దయనీయంగా ఉత్తరకాశీ..
అకాల వర్షాలకు ఉత్తరకాశీ జిల్లా అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక నివాసాలు, వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. సోమవారమూ అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ ప్రకటనతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. విద్యాసంస్థలు మూతపడ్డాయి.
సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. విమానాల సహాయంతో క్షతగాత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
నిలిచిన చార్ధామ్ యాత్ర...
వరుణుడి ప్రతాపానికి చార్ధామ్ యాత్ర నిలిచిపోయింది. సుమారు 800 మంది యాత్రికులు బద్రినాథ్లోనే ఉండిపోయారు. వారికి వసతిని ఏర్పాటు చేశారు అధికారులు.
ఇదీ చూడండి:- ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?