బిహార్ రాజధాని పట్నా అస్తవ్యస్తంగా మారింది. వరుణుడి ప్రకోపానికి జనజీవనం స్తంభించింది. ఎటు చూసినా నీరే కనిపిస్తుండటం.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడం వల్ల ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నిత్యావసరాలు అందక నానా తంటాలు పడుతున్నారు.
![HEAVY RAINS LASHED OUT PATNA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4602735_8.jpg)
![HEAVY RAINS LASHED OUT PATNA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4602735_4.jpg)
పట్నాలోని రాజేంద్రనగర్, కన్కర్బాగ్, లంగర్ టోలీ, బహదూర్పుర్, రాజీవ్‌నగర్, పోస్టల్ పార్క్, ఇందిరానగర్, అశోక్‌నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజధానివ్యాప్తంగా 3 రోజులపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ.
1975 తర్వాత ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా మంగళవారం వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్టు స్పష్టం చేశారు.
![HEAVY RAINS LASHED OUT PATNA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4602735_9.jpg)
![HEAVY RAINS LASHED OUT PATNA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4602735_5.jpg)
ఇంతటి గడ్డు పరిస్థితికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఈటీవీ భారత్ చిత్రీకరించింది.
![HEAVY RAINS LASHED OUT PATNA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4602735_2.jpg)
![HEAVY RAINS LASHED OUT PATNA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4602735_10.jpg)
రైల్వే, రోడ్లు...
భారీ వర్షాలకు రవాణా స్తంభించింది. రైల్వే ట్రాకులు నీటమునిగాయి. అనేక రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్లను దారి మళ్లించారు. రోడ్డు రవాణా పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని బస్సులే రోడ్లపై తిరుగుతున్నాయి.
![HEAVY RAINS LASHED OUT PATNA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4602735_11.jpg)
![HEAVY RAINS LASHED OUT PATNA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4602735_7.jpg)
రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం.. పడవలతో సహాయక చర్యలను చేపట్టింది. నీటిలో చిక్కుకున్న బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ సహా అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
![HEAVY RAINS LASHED OUT PATNA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4602735_1.jpg)
![HEAVY RAINS LASHED OUT PATNA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4602735_6.jpg)
![HEAVY RAINS LASHED OUT PATNA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4602735_1.jpg)
ఇదీ చూడండి:- వరద నీటిలో యువతి కిరాక్ ఫొటోషూట్