ఒడిశా కియోన్‌జార్ జిల్లాలో మరోసారి హృదయవిదార ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణిని ఆసుపత్రికి చేర్చేందుకు ఇద్దరు మహిళా ఆరోగ్య కార్యకర్తలు మోకాళ్ల లోతు నీటిలో ఐదు కిలోమీటర్లు స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు.
మొదటిసారి కాదు..
ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు.. నమితా దేహురి, పూర్ణమి మొహంత్లు ఇలా నీటిలో గర్భిణిలను మోసి సహృదయాలను చాటడం ఇది మొదటిసారేమీ కాదు. స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా.. రోడ్డు రవాణా కరువైన ఈ గ్రామంలో ఇలాంటి దృశ్యాలు ఎన్నో కనిపిస్తాయి.
కియోన్‌జార్ రహదారికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా.. రోడ్డు మార్గం లేకపోవడం వల్ల ప్రజలు రెండు నదులు దాటి ఈ గ్రామానికి చేరుకోవాల్సిన పరిస్థితి. కనీసం అంబులెన్స్ గ్రామంలోకి ప్రవేశించడానకి కూడా వీలు లేని దుస్థితి. 5 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే అక్కడికి అంబులెన్స్ వచ్చే వీలుంటుంది.
అందుకే.. ఎంతటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా.. ఓ గర్భిణీ ఆసుపత్రికి చేరాలంటే ఇలా స్థానికుల సాయంతో ఆరోగ్య కార్యకర్తలు ప్రమాదకరమైన జలయాత్ర చేయాల్సిందే.
ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం