హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులు కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలకు అంగీకరించడం లేదని అధికారులు వెల్లడించారు. వారిలో దగ్గు, జ్వరం సహా.. కొద్దిపాటి కొవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయన్న సమాచారం మేరకు వైద్య బృందం పరీక్షలు నిర్వహించడానికి హాథ్రస్ చేరుకుంది.
'ఆ ఘటన జరిగిన దగ్గరి నుంచి రాజకీయ నాయకులు, పాత్రికేయులు, పోలీసులు మృతురాలి కుటుంబం వద్దకు వెళ్లారు. వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అలాగే బాధిత కుటుంబ సభ్యుల్లో కొందరికి జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని మాకు ఫిర్యాదు అందింది. అందువల్ల వారిని పరీక్షించడానికి వైద్య బృందం వెళ్లగా.. వారు నిరాకరించారు.' అని ఓ అధికారి తెలిపారు.
హాథ్రస్ ఘటన అనంతరం బాధితురాలి మృతదేహానికి హడావుడిగా అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయితే.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.
ఇదీ చదవండి: కొండచిలువ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు!