దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్ అత్యాచార ఘటనలో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాధితురాలి శవపరీక్ష నివేదికలో అత్యాచారం జరిగినట్లు పేర్కొనలేదని అధికారులు తెలిపారు.
శవపరీక్ష నివేదికలో అత్యాచారం గురించి పేర్కొనలేదు. ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నాం.
- విక్రాంత్ వీర్, జిల్లా ఎస్పీ
సామూహిక అత్యాచారం తర్వాత సెప్టెంబర్ 29న సఫ్దార్‌గంజ్ ఆసుపత్రిలో మరణించింది యువతి. అదే రోజు పోలీసుల సమక్షంలో శవపరీక్ష నిర్వహించారు.
ఇదీ చూడండి: బలవంతంగా యూపీ 'నిర్భయ' అంత్యక్రియలు!