ETV Bharat / bharat

'బోడో' ఒప్పందంతో చిరశాంతి రహిస్తుందా?

దశాబ్దాలుగా మరీచికగా మారిన చిరశాంతికి తెరతీస్తూ- ఇంతకాలం సాయుధ పోరుకు సారథ్యం వహిస్తున్న నేషనల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోల్యాండ్‌ (ఎన్‌డీఎఫ్‌బీ) పరిధిలోని నాలుగు వర్గాలతోనూ చరిత్రాత్మక శాంతి ఒప్పందానికి దిల్లీ వేదికైంది. ఎన్‌డీఎఫ్‌బీతోపాటు 1972 లగాయతు ప్రత్యేక బోడో రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ఆల్‌ బోడో స్టూడెంట్స్‌ యూనియన్‌, యునైటెడ్‌ బోడో పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఒప్పంద పత్రాలపై సంతకం చెయ్యడం వల్ల గతంలో మాదిరిగా ఈసారి శాంతి భ్రాంతి కాబోదన్న కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

bodo-issue
'బోడో' ఒప్పందంతో చిరశాంతి రహిస్తుందా?
author img

By

Published : Jan 29, 2020, 8:50 AM IST

Updated : Feb 28, 2020, 9:05 AM IST

అసోంలోని బ్రహ్మపుత్ర నది ఉత్తర తీరం దాదాపు 15 లక్షల మంది బోడోల అస్తిత్వ పోరాట క్షేత్రం. ప్రత్యేక రాష్ట్రసాధన కోసం తీవ్రవాద పంథాలో సాగుతున్న సాయుధ శక్తుల హింసాగ్నికీలల్లో అభాగ్య బోడోలూ నిస్సహాయంగా కడతేరిపోతున్నారన్నది కఠిన యథార్థం! దశాబ్దాలుగా మరీచికగా మారిన చిరశాంతికి తెరతీస్తూ- ఇంతకాలం సాయుధపోరుకు సారథ్యం వహిస్తున్న నేషనల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోల్యాండ్‌ (ఎన్‌డీఎఫ్‌బీ) పరిధిలోని నాలుగు వర్గాలతోనూ చరిత్రాత్మక శాంతి ఒప్పందానికి దిల్లీ వేదికైంది. ఎన్‌డీఎఫ్‌బీతోపాటు 1972 లగాయతు ప్రత్యేక బోడో రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ఆల్‌ బోడో స్టూడెంట్స్‌ యూనియన్‌, యునైటెడ్‌ బోడో పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఒప్పంద పత్రాలపై సంతకం చెయ్యడం వల్ల గతంలో మాదిరిగా ఈసారి శాంతి భ్రాంతి కాబోదన్న కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అసోం విభజన డిమాండ్లన్నింటికీ కాలం చెల్లినట్లేనన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఆయుధాలు పట్టినవారి పట్ల కేంద్రం సానుభూతితో వ్యవహరిస్తుందని భరోసా ఇస్తున్నారు!

ఒప్పందంలో కీలక అంశాలు..

ఇప్పుడు బోడోల్యాండ్‌ ‘టెరిటోరియల్‌ ఏరియా డిస్ట్రిక్‌’గా ఉన్న ప్రాంతాన్ని బోడోల్యాండ్‌ ప్రాదేశిక ప్రాంతంగా వ్యవహరించడం, దాని పరిధిలో ఉన్న మూడువేల పైచిలుకు గ్రామాల్ని బోడోల జనసంఖ్య రీత్యా పునస్సమీక్షించి మార్పులూ చేర్పులు చేయడం, ఆ ప్రాంతంలో జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం, రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, వైద్య కళాశాల, క్యాన్సర్‌ ఆసుపత్రి వంటివెన్నో ఏర్పాటు. కొండప్రాంతాల్లో నివసిస్తున్న బోడోలకు ఎస్‌టీ హోదా, దేవనాగరి లిపిలో బోడో భాషకు రాష్ట్ర అధికారిక అనుబంధ భాషగా గుర్తింపు తాజా ఒప్పందంలో కీలకాంశాలు! బోడోల్యాండ్‌ ప్రాదేశిక మండలి విస్తీర్ణాన్ని పెంచితే సహించేది లేదన్న హెచ్చరికలతో వివిధ బోడోయేతర వర్గాలు అసోమ్‌ బందుకు పిలుపిచ్చిన నేపథ్యంలో, ప్రత్యేక రాష్ట్రంపై మాట్లాడటానికి ఇంకా సమయం ఉందని ఒప్పందంపై చేవ్రాలు చేసిన విద్యార్థి సంఘం స్పష్టీకరిస్తోంది. దానాదీనా తాజా ఒడంబడికతో అసోం కుదుటపడుతుందా- అంటే, సందేహమే మరి!

ఆశ బోధిస్తోంది, అనుమానం బాధిస్తోంది!

పౌరసత్వ సవరణ చట్టం తాలూకు నిరసనలతో అట్టుడుకుతున్న ఈశాన్యంలో- అందునా అసోం అంతర్గత భద్రతకు గొప్ప ఊరటగా కుదిరిన ఈ ఒప్పందం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని కమలనాథులకు ఎంతో సాంత్వన కలిగించేదే. గత 27 ఏళ్లలో బోడోల్యాండ్‌ పైనే ముమ్మార్లు కుదిరిన త్రైపాక్షిక ఒప్పందాలు స్థానిక ఆకాంక్షలు, ప్రాదేశిక సంక్లిష్టతల తీవ్రతను పట్టిచ్చేవే! 1983లో రంజన్‌ దైమారి నేతృత్వంలో బోడో సెక్యూరిటీ ఫోర్స్‌ ఆవిర్భావం, దరిమిలా మైదానపు తెగలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఆల్‌ బోడో స్టూడెంట్స్‌ యూనియన్‌ హింస నచణ- ధ్వంస రచనలతో సాగించిన బందులు అసోంను నిప్పుల కుంపటిలా మార్చేశాయి. కొండకోనల్లో నివసించే తెగలతో సమానంగా తమకూ సముచిత రాజ్యాంగ రక్షణలు, బోడో ప్రాంతాల అభివృద్ధే ప్రధాన డిమాండ్లుగా మొదలైన ఆందోళన, గిరిజన ప్రాంతాల్లో అస్సామీని అధికార భాషగా చెయ్యడానికి ప్రయత్నించడం వల్ల ప్రత్యేక రాష్ట్ర నినాదంతో తీవ్రవాదం రూపుదాల్చి భగ్గుమంది. ఎట్టకేలకు 1993 ఫిబ్రవరిలో కుదిరిన తొలి త్రైపాక్షిక ఒప్పందం బోడోల్యాండ్‌ స్వతంత్ర మండలి ఏర్పాటుకు శ్రీకారం చుట్టినా- అది తమ ఆకాంక్షలకు దీటుగా లేదంటూ ఎన్‌డీఎఫ్‌బీ సాయుధ పోరుకు సమకట్టింది. తీవ్రవాద శక్తుల ప్రత్యేక రాష్ట్రపోరు తీవ్రతరమైన తరుణంలో, 2003 ఫిబ్రవరిలో రెండో త్రైపాక్షిక ఒప్పందం ద్వారా నాలుగు జిల్లాలతో కూడిన బోడోల్యాండ్‌ ప్రాదేశిక మండలి ఆవిర్భవించింది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలు కింద సమధిక అధికారాలు జమపడటం కొన్ని వర్గాలకు సంతృప్తి కలిగించినా- ఆల్‌ బోడో స్టూడెంట్స్‌ యూనియన్‌ వంటివి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే నినదిస్తుంటే, ఎన్‌డీఎఫ్‌బీ-ఎస్‌ వర్గం దారుణ దమనకాండతో వందల మందిని బలిగొంది. ఆయా ప్రతీపశక్తులూ శాంతి ఒప్పందానికి కూడిరావడం స్వాగతించదగ్గదే అయినా- ఆశ బోధిస్తోంది, అనుమానం బాధిస్తోంది!

సహేతుక పరిష్కారాలతోనే..

గణతంత్ర రాజ్యంగా ఇండియా అవతరించే నాటికి నాగాలాండ్‌, మేఘాలయ, మిజోరం అప్పటి అసోంలో జిల్లాలుగా ఉండేవి. 1948లో ఇండియాలో విలీనం దరిమిలా మణిపూర్‌, త్రిపుర కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. 98 శాతం సరిహద్దుల్ని విదేశాలతో పంచుకొంటున్న ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక ప్రాధాన్యం, స్థానికంగా భిన్న జాతుల ప్రజల జీవన విలక్షణతలు, వారి అభివృద్ధికాంక్షల పట్ల పూర్తి అవగాహనతో స్వతంత్ర జిల్లా మండళ్ల ద్వారా స్వపరిపాలనకు రాజ్యాంగ రూపశిల్పులు వీలు కల్పించారు. ఏకంగా 238 విభిన్న స్థానిక తెగలకు ఆలవాలమైన ఈశాన్యంలో- అక్రమ వలసల తాకిడి తమ అస్తిత్వాన్నే హరిస్తుందన్న భయాలు ఒక వంక, సామాజికార్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో వెనకబడిపోతున్నామన్న ఆందోళనలు మరోవంక అసంతృప్తికి ఆజ్యంపోస్తున్నాయి. బోడోలు శాంతించడంతో అసోం విభజన డిమాండ్లకు తెరపడినట్లేనని కేంద్రం భావిస్తున్నా, నాథ్‌-యోగి వర్గీయుల్ని ఎస్టీల్లో చేర్చి ప్రత్యేక స్వతంత్ర మండలి ఏర్పాటు చెయ్యాలన్న డిమాండు తాజాగా వెలుగులోకొచ్చింది. అసోంలోని ఏడు లక్షల మంది గారో ప్రజల కోసం స్వతంత్ర మండలి ఏర్పాటు కావాలని 17 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ సాయుధ ఘర్షణ తప్పదని ఆ వర్గం హెచ్చరిస్తోంది. బోడోలకు కేంద్రం ‘అనధికారిక రాష్ట్ర హోదా’ కల్పించడాన్ని తీవ్రంగా గర్హిస్తున్న వర్గాలూ కారాలూ మిరియాలూ నూరుతున్నాయి. పరిస్థితి చేజారక ముందే సహేతుక పరిష్కారాలు అన్వేషించి దిద్దుబాటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగినప్పుడే ఈశాన్యంలో చిరశాంతి రహిస్తుంది!

Intro:Body:Conclusion:
Last Updated : Feb 28, 2020, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.