ETV Bharat / bharat

'లబ్ధి పొందటం మాని.. తక్షణమే ధరలు తగ్గించండి'

పెట్రోల్​, డీజిల్​ నుంచి లబ్ధి పొందడం మానుకుని.. ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. స్పీక్​అప్​​ అగైనస్ట్​ ఫ్యూయల్​ హైక్​"లో పాల్గొన్న ఆయన.. ప్రజలు ఒకే తాటిపై నిలబడితేనే కేంద్రం ధరలను తగ్గిస్తుందని అభిప్రాయపడ్డారు.

Govt should stop profiteering from petrol, diesel; reduce fuel prices: Rahul Gandhi
'లబ్ధిపొందటం మాని.. ముందు ధరలు తగ్గించండి'
author img

By

Published : Jun 29, 2020, 8:07 PM IST

Updated : Jun 29, 2020, 10:04 PM IST

పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ మండిపడ్డారు. పెట్రోల్​, డీజిల్​ నుంచి లబ్ధిపొందడం మానుకుని.. పెంచిన ధరలు, ఎక్సైజ్​ సుంకాలను మోదీ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. "స్పీక్​అప్​ అగైనస్ట్​ ఫ్యూయల్​ హైక్​" కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు రాహుల్​.

"మే 25 నుంచి 22సార్లు పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచడం కేంద్రం చేసిన అతిపెద్ద తప్పు. ఒక్కసారి కాదు.. మొత్తం 22సార్లు ధరలను పెంచింది. పేదల జీవితాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపింది. పెట్రోల్​, డీజిల్​ నుంచి లబ్ధిపొందడం మానుకుని కేంద్రం తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలి. ఈ విషయంలో మనం అందరం ఒకే తాటిపై ఉంటేనే ప్రభుత్వానికి అర్థమవుతుంది. అప్పుడే ఇంధన ధరలను తగ్గిస్తుంది."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

కరోనా సంక్షోభం వల్ల సమాజంలోని అన్ని వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ఇలాంటి సమయంలో పెట్రోల్​ ధరలు పెంచడం దారుణమని పేర్కొన్నారు రాహుల్​.

పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా "స్పీక్​ అప్​ అగైనస్ట్​ ఫ్యూయల్​ హైక్​" పేరుతో ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్​. ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలు సహా అనేకమంది మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇదీ చూడండి:- 'పెట్రో ధరల పేరిట కేంద్రం​ బలవంతపు వసూళ్లు'

Last Updated : Jun 29, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.