రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్.. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్రం అమలు చేస్తున్న పథకం. 2018 నుంచి నాలుగేళ్ల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. నాలుగు విడతలకు గాను రూ.7,255 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చేయూత అందిస్తున్నామన్నారు తోమర్.
మానవ వనరుల అభివృద్ధి, గ్రామసభల బలోపేతం, దూరవిద్యకు మద్దతు, సాంకేతిక ప్రోత్సాహం, ఆర్థిక అభివృద్ధి, ధనాన్ని వృద్ధి చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు తోమర్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'ప్రధానమంత్రి మోదీ ప్రజలను మభ్యపెడుతున్నారు'