ETV Bharat / bharat

ఆయుర్వేద పట్టభద్రులూ శస్త్రచికిత్సలు చేయొచ్చు

ఆయుర్వేదంలోని పలు విభాగాల్లో పీజీ చేసిన విద్యార్థులకు శస్త్రచికిత్సల నిర్వహణ కోసం శిక్షణ ఇచ్చేందుకు అనుమతించింది కేంద్రం. ఈ మేరకు ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ నిబంధనలు సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్​పై పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది ఆయుష్ మంత్రిత్వ శాఖ.

http://10.10.50.70:6060///finalout1/urdu-nle/finalout/22-November-2020/9627361_picture.jpg
ఆయుర్వేద పట్టభద్రులూ శస్త్రచికిత్సలు చేయొచ్చు
author img

By

Published : Nov 22, 2020, 7:15 PM IST

ఆయుర్వేదానికి సంబంధించిన పలు కోర్సుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులు శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అపాయం లేని కణతులను తొలగింపు, ముక్కు, కంటి శుక్లాల నిర్మూలన, వ్రణ విచ్ఛేదనం వంటి శస్త్రచికిత్సలకు శిక్షణ అందించేందుకు అనుమతించే విధంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్(పోస్ట్ గ్రాడ్యూయేట్ ఆయుర్వేద ఎడ్యుకేషన్) నిబంధనలకు సవరణలు చేస్తూ 39 సాధారణ శస్త్రచికిత్సలు, 19 చికిత్స విధానాలను అందులోకి చేర్చింది.

అయితే సీసీఐఎం విడుదల చేసిన నోటిఫికేషన్ కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కొటేచా స్పష్టం చేశారు.

"ఆయుర్వేద ప్రాక్టీషనర్లను శస్త్రచికిత్స రంగంలోకి పూర్తిగా అనుమతించడం ఈ నోటిఫికేషన్ ఉద్దేశం కాదు. ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలను ఇది క్రమబద్ధీకరిస్తుంది. ఆయుర్వేదంలో పీజీ చేసిన ప్రతీ ఒక్కరికి ఇది వర్తించదు. శల్య, శాలక్యలో నైపుణ్యం ఉన్నవారికే ఈ శస్త్రచికిత్సలు నిర్వహించే అనుమతి ఉంటుంది."

-రాజేష్ కొటేచా, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి

సీసీఐఎం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ వైద్య జయంత్ దేవ్​పూజారి సైతం ఈ నోటిఫికేషన్​పై వివరణ ఇచ్చారు. ఆయుర్వేద సంస్థల్లో గత 20 సంవత్సరాలుగా ఈ విధానాలు కొనసాగుతున్నాయని, ప్రస్తుత నోటిఫికేషన్ వాటిని చట్టబద్ధం చేస్తుందని చెప్పారు. దీని ద్వారా ఆయుర్వేద ప్రాక్టీషనర్లు శస్త్రచికిత్సల విధివిధానాలను తగిన నియంత్రణతో పాటించే అవకాశం ఉందని తెలిపారు.

పేరు మార్చండి: టీఎంసీ ఎంపీ

ప్రభుత్వ నిర్ణయంపై భారతీయ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శాంతను సేన్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయుర్వేదంలో శస్త్రచికిత్సలను ప్రోత్సహించాలంటే ప్రత్యేక పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. మిక్సోపతిని ప్రోత్సహించడం అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమేనని అన్నారు. ఐఎంఏ తొలి నుంచీ దీనికి వ్యతిరేకంగా పోరాడుతోందని తెలిపారు.

వివరణ

అయితే ఈ నోటిఫికేషన్​పై పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన వేళ ఆయుష్ శాఖ వివరణ ఇచ్చింది. నోటిఫికేషన్ 58 శస్త్రచికిత్సల విధానాలకు సంబంధించినదేనని స్పష్టం చేసింది. శల్యా, శాలక్య పీజీ హోల్డర్లు ఇతర సర్జరీలు నిర్వహించేందుకు అనుమతులు ఉండవని తెలిపింది. ఈ నోటిఫికేషన్ విధానపరమైన మార్పులు సూచించదని, ప్రస్తుతం ఉన్న నిబంధనలను మరింత స్పష్టంగా నిర్వచిస్తుందని పేర్కొంది. ఆయుర్వేదంలో శల్యా, శాలక్యలు వేర్వేరు శాఖలేనని, వీరు శస్త్రచికిత్సలు నిర్వహించడం తొలి నుంచీ ఉందని వివరించింది.

వీరి శిక్షణకు సంబంధించి పదజాలం మార్చాలని పలు అభిప్రాయాలు వ్యక్తమైన వేళ దీనిపై స్పష్టతనిచ్చింది ఆయుష్ శాఖ. ఆధునిక పరిభాష ఉపయోగంపై ఎలాంటి అభ్యంతరాలు తమ దృష్టికి రాలేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన వివాదంపై తమకు సమాచారం లేదని స్పష్టం చేసింది. ఈ పరిభాషలపై ఎవరికీ గుత్తాధిపత్యం లేదని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.