ETV Bharat / bharat

వచ్చే వారం నుంచి విస్తారంగా వర్షాలు: ఐఎండీ - India Meteorological Department news

వచ్చే వారం నుంచి మధ్య, దక్షిణ భారత్​లో విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. బంగాళఖాతంలో ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారి రుతుపవనాల పురోగతికి సాయంగా నిలువనుందని తెలిపింది. జూన్​ 1 నుంచి ఇప్పటి వరకు సాధారణం కన్నా 9 శాతం మేర అదనపు వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.

Good rainfall activity expected next week
వచ్చే వారం నుంచి విస్తారంగా వర్షాలు
author img

By

Published : Jun 5, 2020, 4:32 PM IST

Updated : Jun 5, 2020, 5:31 PM IST

బంగాళాఖాతంలో అల్పపీడనంతో తుపాను ఏర్పడే అవకాశం ఉన్నందున వచ్చే వారం నుంచి మధ్య, దక్షిణ భారత్​లో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ విభాగం వెల్లడించింది. అది రుతుపవనాల పురోగతికి సాయంగా మారనుందని పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను ఒడిశా వైపుగా కదిలే అవకాశం ఉందని తెలిపారు ఐఎండీ డైరెక్టర్​ జనరల్​ మృత్యుంజయ్​ మహాపాత్ర.

" అల్పపీడనం అనేది తుపాను ఏర్పడేందుకు కారణమవుతుంది. ఏ తుపానుకైనా ఇది తొలి దశ. అయితే.. ప్రతిసారి అల్పపీడనం తుపానుగా మారాలనేది లేదు. వచ్చే వారం ఏర్పడే అల్పపీడనం రుతుపవనాల పురోగతికి సాయంగా మారుతుంది. విస్తారంగా వర్షాలు పడతాయి. ఈశాన్య రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని కొంత భాగం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిని మరో రెండు రోజుల్లో తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి."

- మృత్యుంజయ్​ మహాపాత్ర, ఐఎండీ డైరెక్టర్​ జనరల్​

రుతుపవనాల రాకకు 'నిసర్గ' సాయం..

ఈ ఏడాది రుతుపవనాల రాక 4 రోజులు ఆలస్యమవుతుందని ఐఎండీ అంచనా వేసింది. కానీ అనుకున్న సమయానికి జూన్​ 1న కేరళను తాకాయి. రుతుపవనాలు సరైన సమయానికి కేరళకు చేరేందుకు నిసర్గ తుపాను సాయంగా నిలిచింది. జూన్​ 1 నుంచి ఇప్పటి వరకు పడాల్సిన వర్షాపాతంతో పోలిస్తే ఈ ఏడాది 9 శాతం అదనంగా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.

మధ్యదర సముద్రంలో ఏర్పడే తుపాను కారణంగా ఉత్తర భారత్​లోనూ వచ్చే వారం వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ

Last Updated : Jun 5, 2020, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.