ETV Bharat / bharat

గోల్డ్​ స్మగ్లింగ్​ కేసులో భారీ నగదు, బంగారం స్వాధీనం

కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్​ స్మగ్లింగ్​ కేసులో ఎన్​ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పలు చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు రూ.కోటి నగదు, 1కేజీ బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Gold smuggling case
కేరళ గోల్డ్​ స్మగ్లింగ్​ కేసులో భారీ నగదు, బంగారం స్వాధీనం
author img

By

Published : Jul 25, 2020, 10:57 AM IST

కేరళలో తీవ్ర కలకలం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా స్వప్న సురేశ్​ పేరిట ఉన్న రెండు బ్యాంక్​ లాకర్ల నుంచి రూ.1కోటి, 1కేజీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో స్వప్న రెండో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది.

Swapna Suresh
స్వప్న సురేశ్​

రిమాండ్​ రిపోర్టును కోర్టుకు అందజేసిన ఎన్​ఐఏ.. పలు విషయాలు వెల్లడించింది. తిరువనంతపురంలోని ఫెడరల్​ బ్యాంక్​లో స్వప్న పేరుతో రూ.36.5 లక్షలు ఉన్నట్లు తెలిపింది. మరో రూ.64 లక్షలు, 982.5 గ్రాముల బంగారం ఆభరణాలను అదే ప్రాంతంలోని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో గుర్తించినట్లు స్పష్టం చేసింది.

కోర్టుకు హాజరైన స్వప్న తరఫు న్యాయవాది.. ఆ ఆభరణాలు దుబాయ్​లోని ఓ షేక్​ పెళ్లి కానుకగా ఇచ్చినట్లు తెలిపారు. కోర్టుకు హాజరైన స్వప్న.. కస్టమ్స్​ అధికారులు తనను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని కోర్టుకు విన్నవించింది. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం స్వప్నను కలిసేందుకు తన పిల్లలకు అనుమతి ఇచ్చింది.

ఆగస్టు 21 వరకు కారాగారంలో..!

నిందితులు స్వప్న సురేశ్​, సందీప్​ నాయర్​లకు ఆగస్టు 21 వరకు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశించింది. ఫలితంగా ఇద్దరినీ ఎర్నాకులంలోని కక్కనాడ్​ జిల్లా కారాగారంలో ఉంచనున్నారు. బెయిల్​ కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను వచ్చే బుధవారం కోర్టు పరిశీలించనుంది. విచారణ సమయంలో ఎన్​ఐఏ తరఫున అసిస్టెంట్​ సొలిసిటల్​ జనరల్​ హాజరవనున్నారు. స్వప్న తరఫున లాయర్​ జియో పాల్​, సందీప్​ నాయర్​ తరఫున న్యాయవాది విజయ పీవీ వాదించనున్నారు.

ఇదీ జరిగింది...!

కేరళలోని యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దౌత్య కార్యాలయానికి చెందిన పార్శిల్‌లో రూ. 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని.. జులై 4న విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య కార్యాలయానికి చెందిన ప్యాకేజీలో బంగారం పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వప్న, సందీప్​ సహా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన కార్యదర్శిపై ఆరోపణలు రావడం వల్ల వారిని ఆయా పదవుల నుంచి తొలగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.