ETV Bharat / bharat

భార్య బొట్టు పెట్టుకోలేదని విడాకులిచ్చిన భర్త - assam guahati high court

భార్య బొట్టు పెట్టుకోలేదని విడాకులు కోరిన భర్తకు గువాహటి హైకోర్టు న్యాయం చేసింది. భర్త కోరినట్లుగానే వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ఇదివరకు విడాకులు మంజూరు చేయకుండా కుటుంబ కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది.

Gauhati HC grants divorce to man after woman refuses to wear 'sindoor', 'shaka'
భార్య బొట్టు పెట్టుకోలేదని.. న్యాయపరంగా విడాకులిచ్చిన భర్త!
author img

By

Published : Jun 30, 2020, 3:25 PM IST

పెళ్లయ్యాక గాజులు వేసుకోవడం.. బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయంలో అనివార్యం. ఆ సంప్రదాయాన్ని కాదని బొట్టు, గాజులు వేసుకోని భార్యతో విడిపోవాలనుకున్న భర్తకు అసోం గువాహటి హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.

భార్య పోరు పడలేక...

2012 ఫిబ్రవరి 17న పెళ్లి చేసుకున్నారు ఆ దంపతులు. భర్త కుటుంబంతో కలిసి ఉండడం ఇష్టంలేదని మొండికేసింది భార్య. బొట్టూ, గాజులు పెట్టుకోకుండా మొరాయించింది. దీంతో, 2013 జూన్​ 30 నుంచి వారిద్దరు వేరుగా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో భర్తపై క్రిమినల్​ కేసులు పెట్టింది ఆ మహిళ.

భార్యతో ఇక వేగలేక.. గువాహటి కుటుంబ కోర్టును ఆశ్రయించాడు భర్త. విడాకులిప్పంచమని వేడుకున్నాడు. కానీ, భార్యవైపు తప్పులేమీ లేనందున విడాకులు మంజూరు చేయలేదు కుటుంబ కోర్టు.

హైకోర్టులో న్యాయం..

హైకోర్టులో పిటిషన్​ వేశాడు భర్త. చీఫ్ జస్టిస్ అజయ్ లాంబా, జస్టిస్ సౌమిత్రా సైకియాతో కూడిన ధర్మాసనం భర్త వైపే న్యాయముందని భావించింది. కుటుంబ కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. బొట్టుపెట్టుకోని భర్యతో విడాకులు మంజూరు చేసింది.

"బొట్టు పెట్టుకోవడానికి, గాజులు వేసుకోవడానికి ఆమె సిద్ధంగా లేదంటే.. ఆమెకు భర్తతో వివాహం ఇష్టం లేదని అర్థం. తన చర్యలు ద్వారా భర్తతో జీవితాన్ని పంచుకోవడం ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది. తల్లిదండ్రుల సంక్షేమం- సీనియర్ సిటిజన్స్ చట్టం-2007 ప్రకారం మహిళ తన భర్తను వృద్ధ తల్లికి దూరం చేయాలని చూసింది. ఈ విషయాన్ని కుటుంబ కోర్టు పూర్తిగా విస్మరించింది. కానీ, ఇది ఆమె క్రూరత్వానికి నిదర్శనం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భర్త లేదా అతడి కుటుంబ సభ్యులపై ఆధారాలు లేని ఆరోపణల చేయడం, క్రిమినల్ కేసులు నమోదు చేయడమూ నేరమే."

- గువాహటి హైకోర్టు తీర్పు

ఇదీ చదవండి:'చెప్పేవి 'స్వదేశీ' మాటలు.. దింపేవి చైనా వస్తువులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.