ETV Bharat / bharat

కశ్మీర్​లో నవోదయం... ఈ అర్ధరాత్రే ముహూర్తం - Jk lt governor

ఆర్టికల్​ 370 రద్దు.. మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో పాటు పునర్విభజన బిల్లు ఆగస్టులోనే పార్లమెంట్ ఆమోదం తెలిపినా.. ఇవాళ అర్ధరాత్రి నుంచి అమలుకానుంది. ఫలితంగా జమ్ముకశ్మీర్‌ శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా విడిపోనున్నాయి. 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలతో భారత చిత్రపటం సరికొత్తగా రూపుదిద్దుకోనుంది.

కశ్మీర్​లో నవోదయం... ఈ అర్ధరాత్రే ముహూర్తం
author img

By

Published : Oct 30, 2019, 6:16 PM IST

జమ్ముకశ్మీర్‌ చరిత్రలో గురువారం నుంచి సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఇప్పటి వరకు లద్దాఖ్​తో కలిపి జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని చూసిన దేశ ప్రజలు.. ఇకపై రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా చూడనున్నారు. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న భారతదేశం.. 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలతో 'నవ భారతం'గా రూపుదిద్దుకోనుంది. ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణానికి ముగింపు పలికి.. భారత చట్టంలో సరికొత్త 'కశ్మీరం' దర్శనమివ్వనుంది.

దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్‌ అంశంపై మోదీ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 5న సంచలన నిర్ణయం తీసుకుని.. ఆర్టికల్​ 370ని రద్దు చేసింది. జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆగస్టులోనే పార్లమెంట్​లో ఆమోదం పొందిన ఈ బిల్లుతో.. జమ్ముకశ్మీర్‌ శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా విడిపోయాయి. భారత తొలి హోంమంత్రి సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతి సందర్భంగా ఇవాళ అర్ధరాత్రి నుంచే ఈ చట్టం అమలులోకి రానుంది.

From midnight, JK will cease to be a state; two new UTs to come into existence
నవభారత చిత్రపటం

రేపే లెఫ్టినెంట్​ గవర్నర్ల ప్రమాణం

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ లెఫ్టినెంట్​ గవర్నర్లుగా ఐఏఎస్​ అధికారులు గిరీశ్​ చంద్ర ముర్ము, ఆర్​కే మథుర్​లు గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం శ్రీనగర్​, లేహ్​లో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జమ్ముకశ్మీర్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ గీతా మిత్తల్​ ఈ ఇద్దరితో ప్రమాణం చేయించనున్నారు.

ఆగస్టు 5న పార్లమెంట్ ఆమోదం

1947 అక్టోబర్​ 24 నుంచి ప్రత్యేక ప్రతిపత్తితో ఉన్న కశ్మీర్​ను భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానం చేస్తూ.. ఆగస్టు 5న నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్​ 370,35ఏ రద్దుతో పాటు జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్​ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం కశ్మీర్​లో మరిన్ని మార్పులు జరగనున్నాయి. అవేంటంటే..

2019 జమ్ముకశ్మీర్​ పునర్విభజన చట్టం ప్రకారం..

⦁ రెండు రాష్ట్రాలకు వేర్వేరు లెఫ్టి​నెంట్​ గవర్నర్లు ఉంటారు.
⦁ ప్రస్తుతం జమ్ముకశ్మీర్​లోని ఐఏఎస్​, ఐపీఎస్ అధికారులు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ యధాతథంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ​
⦁ రెండు ప్రాంతాల్లోని ఐఏఎస్​, ఐపీఎస్, ఏసీబీ(అవినీతి నిరోధకశాఖ) అధికారులతో పాటు ఇతర కేంద్ర విభాగ అధికారులు లెఫ్టినెంట్​ గవర్నర్​ ఆధీనంలో ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి వీరిపై ఎలాంటి అధికారం ఉండదు.

చివరి ముఖ్యమంత్రి, గవర్నర్​ వీరే

ఉమ్మడి జమ్ముకశ్మీర్​కు చివరి ముఖ్యమంత్రి, గవర్నర్​గా మెహబూబా ముఫ్తీ, సత్యపాల్​ మాలిక్​ బాధ్యతలు నిర్వర్తించారు.
ఒక రాష్ట్రం.. కేంద్ర పాలిత ప్రాంతంగా మారడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut, Lebanon - 30 October 2019
1. Tents and bricks placed by protesters blocking Tabaris Square in Beirut
2. Protesters removing a tent
3. Mid of protesters arguing
4. Wide of protesters and tents
5. Protesters sleeping inside a tent
6. Wide of protesters dismantling tents
7. SOUNDBITE (Arabic) Rayyan Abu Ltaif, protester:
"We will not clash with the army because they are supportive of us, therefore, we will support them as well. We hope nothing (bad) will happen. In a worst case scenario, we will go to Riad El-Solh Square and give them (government) a 72-hour deadline, as they did with us, then we will escalate and will go back to the streets."
8. Various of police bulldozer removing bricks from the street
9. Various of protesters sitting in the middle of the street, refusing to move
STORYLINE:
Lebanese army and police are reopening major roads, as army units with bulldozers took down barriers and tents set up in the middle of highways and major intersections, a day after the resignation of the Lebanese government.
At Tabaris Square, Lebanese security forces negotiated with the protesters to re-open the Ring Bridge that connects eastern and western Beirut.
Protesters removed their tents as a police bulldozer was removing the bricks from the middle of the street.
There was no significant resistance from protesters as army units with bulldozers took down barriers and tents set up in the middle of highways and major intersections Wednesday.
The move comes a day after Prime Minister Saad Hariri announced his government's resignation after nearly two weeks of nationwide protests, in the first major win for the protest movement.
The leaderless protesters had mixed opinions on whether they should leave the streets or continue with their campaign, which has left banks, schools and other businesses shuttered since Oct. 18.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.