ETV Bharat / bharat

నిలకడగా మన్మోహన్​ సింగ్​ ఆరోగ్యం.. కానీ! - మన్మోహన్​ సింగ్​ వార్తలు

manmohan
మన్మోహన్​
author img

By

Published : May 11, 2020, 10:26 AM IST

Updated : May 11, 2020, 10:56 AM IST

10:37 May 11

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని దిల్లీ ఎయిమ్స్‌ వర్గాలు వెల్లడించాయి. కొత్త మందులు రియాక్షన్ ఇవ్వడం, జ్వరం రావడానికి కారణాలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు వైద్యులు.

87 ఏళ్ల మన్మోహన్​ను గుండె-ఊపిరిత్తుల విభాగంలో పరిశీలనలో ఉంచారు. గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ నితీశ్ నాయక్ పర్యవేక్షణలో మన్మోహన్ సింగ్‌ ఉన్నారు. ఆయన వైద్య పరామితులన్నీబాగానే ఉన్నాయని సన్నిహితులు తెలిపారు. అయినప్పటికీ పరిశీలనలో ఉంచినట్లు పేర్కొన్నారు. 2009లో ఎయిమ్స్ వైద్యులే మన్మోహన్ సింగ్‌కు బైపాస్ సర్జరీ చేశారు.

2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా పనిచేసిన మన్మోహన్‌ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మాజీ ప్రధాని ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు వెంటనే కోలుకోవాలని ట్వీట్లు‌ చేశారు

10:17 May 11

మాజీ ప్రధాని మన్మోహన్​ అనారోగ్యానికి కారణమేంటి?

మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎయిమ్స్​ ఆసుపత్రి వర్గాల సమాచారం. అయితే ఆయనకు మందులు ఇచ్చిన తర్వాత కొన్ని సైడ్​ ఎఫెక్ట్స్​​ కనిపించినట్లు తెలుస్తోంది. అసలు జ్వరం రావడానికి మరేమైనా కారణాలు ఉన్నాయా అని వైద్యులు పరీక్షిస్తున్నారు. 

Last Updated : May 11, 2020, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.