కర్ణాటక మాజీ మంత్రి, హూవిన హడగలి ప్రస్తుత ఎమ్మెల్యే పీటి పరమేశ్వర్ కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లి వేడుకలో కరోనా నిబంధనలు మాత్రం గాలికొదిలేశారు. అతిథుల్లో చాలామంది మాస్కు కూడా ధరించలేదు. కర్ణాటక ఆరోగ్య మంత్రి కూడా ఈ నిబంధనలు ఉల్లంఘించడం విమర్శలకు తావిస్తోంది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే ఒక్కరూ భౌతికదూరాన్ని పాటించలేదు. బాధ్యతగల ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి కరోనా నిబంధనలను గాల్లోకి వదిలడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.