ETV Bharat / bharat

పార్లమెంట్​ ముందుకు తొలి దఫా అనుబంధ పద్దు

తొలి దఫా అనుబంధ పద్దును పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. రూ. 2.35లక్షల కోట్లను అదనంగా ఖర్చుపెట్టేందుకు ఆమోదించాలని కోరారు. అయితే ఇందులోని అధిక భాగం కరోనాపై పోరు కోసమే వినియోగించనున్నట్టు స్పష్టం చేశారు.

FM presents first batch of supplementary demands; seeks additional Rs 2.35 lakh cr
పార్లమెంట్​ ముందుకు తొలి దఫా అనుబంధ పద్దు
author img

By

Published : Sep 14, 2020, 4:05 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.​. పార్లమెంట్​లో తొలి దఫా అనుబంధ పద్దును ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 2.35లక్షల కోట్లను అదనంగా ఖర్చు చేసేందుకు సభ అనుమతి కోరారు. ఈ మొత్తంలోని అధిక భాగం(రూ. 1.66లక్షల కోట్లు) కరోనాపై పోరు కోసమే ఉపయోగించనున్నట్లు తెలిపారు.

మొత్తం నిధుల్లో రూ. 40వేల కోట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కోసం ప్రభుత్వం కేటాయించనుంది. మరో రూ. 33,771 కోట్లు.. ప్రధానమంత్రి జన్​ధన్​ యోజన, జాతీయ సామాజిక సహాయం లబ్ధిదారులకు ప్రత్యక్షంగా బదిలీ చేయనుంది.

ఇదీ చూడండి:- 17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

అయితే ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ యోజన కింద రూ. 33,771 కోట్లను ఇప్పటికే మహిళలు, పింఛనుదారుల జన్​ధన్​ ఖాతాలకు ప్రత్యక్షంగా బదిలీ చేసినట్టు పార్లమెంట్​కు ప్రభుత్వం తెలిపింది.

15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు​ రాష్ట్రాలకు అందించాల్సిన పోస్ట్​ డివల్యూషన్​ రెవెన్యూ డెఫిసిట్​ గ్రాంట్ల కోసం రూ. 46,602కోట్లు అదనంగా కేటాయించాలని ప్రభుత్వం అభ్యర్థించింది.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.