ETV Bharat / bharat

అసోం వరదల్లో 108కి చేరిన మృతులు

అసోంలో వరదల ప్రభావం తగ్గుముఖం పడుతోంది. వర్షాల తగ్గుదలతో ఆయా జిల్లాల్లో పరిస్థితులు మెరుగవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 12 లక్షల మంది వరద ప్రభావంలో ఉన్నట్లు చెప్పారు. తాజాగా మరో వ్యక్తి మృతి చెందగా.. మృతుల సంఖ్య 108కి చేరింది.

assam floods
అసోంలో వరదల ప్రభావం తగ్గుముఖం
author img

By

Published : Jul 31, 2020, 5:23 AM IST

అసోంలో భారీ వర్షాలు, వరదలు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో కాస్త మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. అయితే.. గురువారం వరదల్లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 108కి చేరింది.

12 లక్షల మంది..

వరదల తగ్గుముఖంతో బ్రహ్మపుత్ర, దాని పరివాహక ప్రాంతంలోని 22 జిల్లాల్లో వరదల ప్రభావానికి గురైన వారి సంఖ్య 12 లక్షలకు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. అది బుధవారం నాటికి 17 లక్షలకుపైగా ఉన్నట్లు తెలిపారు. తాజాగా మృతి చెందిన వ్యక్తి మోరిగావూన్​ జిల్లాలోని మికిర్​భేటా ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. కొండచరియలు విరిగిపడి 26 మంది మృతి చెందారు.

గవర్నర్​ పర్యటన..

నదులు ఉప్పొంగి వేల మంది నిరాశ్రయులుగా మారిన బార్​పేట, బక్షా జిల్లాల్లో అసోం గవర్నర్​ జగదీశ్​ ముఖీ పర్యటించారు. వరద పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి: బిహార్​లో 40 లక్షల మందిపై వరదల ప్రభావం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.