ETV Bharat / bharat

త్వరలో త్రివిధ దళాల తొలి సంయుక్త నిర్వహణ కేంద్రం! - rawat latest news

త్రివిధ దళాల మొదటి సంయుక్త నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు సీడీఎస్ జనరల్ బిపిన్​ రావత్​. ఈ ఏడాది జూన్​ నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భారత వాయుసేనకు మార్షల్ స్థాయి అధికారి ఈ కేంద్రానికి నేతృత్వం వహిస్తారు.

first integrated tri service command to be set up
త్వరలో త్రివిధ దళాల తొలి సంయుక్త నిర్వహణ కేంద్రం!
author img

By

Published : Feb 15, 2020, 11:10 PM IST

Updated : Mar 1, 2020, 11:48 AM IST

భారత త్రివిధ దళాల తొలి సంయుక్త నిర్వహణ కేంద్ర నిర్మాణాన్ని ఈ ఏడాది జూన్​లోగా పూర్తి చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దీని ఏర్పాటుకు సంబంధించిన చర్చలను సైన్యాధిపతి ముకుంద్​ నరవణే, వాయుసేన అధిపతి ఆర్​కేఎస్ భదౌరియాలతో జరుపుతున్నారు సీడీఎస్ బిపిన్ రావత్​.

భారత వాయిసేన ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని నిర్వహించనున్నారు. ఎయిర్​ మార్షల్ అధికారి దీనికి సారథ్యం వహిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. దీనితో పాటు సంయుక్త థియేటర్​ కమాండ్లను ఏర్పాటు చేసే ప్రణాళికను రావత్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సంయుక్త ద్వీపకల్ప, రవాణా వ్యవస్థ​ కమాండ్​లను నిర్మించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ కమాండ్ల నిర్వహణకు అదనపు జనరల్ ర్యాంకు పోస్టులను సృష్టించే అవకాశం లేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. థియేటర్ కమాండ్​ల నిర్వహణను త్రివిధ దళాల్లోని లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకు అధికారులు చేపట్టనున్నట్లు తెలిపాయి.

ఇదీ చూడండి: నో టైం: ఆఫీస్‌లో పెళ్లిచేసుకున్న అధికారులు

Last Updated : Mar 1, 2020, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.