మహారాష్ట్ర ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బోరీవలీలోని షాపింగ్ సెంటర్లో శనివారం వేకువజామున మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేస్తున్నారు.
షాపింగ్ సెంటర్‌పై అంతస్తులకూ మంటలు వ్యాపించాయి. వాటిని అదుపు చేయడానికి ఫైర్ రోబోట్ సాయంతో నిర్విరామంగా కృషి చేస్తున్నారు సిబ్బంది. మరో రెండు 2 గంటల్లో మంటలు అదుపులోకి రావొచ్చని అధికారులు తెలిపారు.
![Fire breaks out at a shopping centre at Borivali West in Mumbai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7979702_7.jpg)
![Fire breaks out at a shopping centre at Borivali West in Mumbai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7979702_1.jpg)
![Fire breaks out at a shopping centre at Borivali West in Mumbai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7979702_8.jpg)
![Fire breaks out at a shopping centre at Borivali West in Mumbai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7979702_6.jpg)
![Fire breaks out at a shopping centre at Borivali West in Mumbai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7979702_3.jpg)
ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 27,114 కరోనా కేసులు.. 519 మరణాలు