ETV Bharat / bharat

'దిశ'కు న్యాయం- సజ్జనార్​ స్వస్థలంలో సంబరం - సీపీ సజ్జనార్​ దిశా ఎన్​కౌంటర్​ సారథి

ఆయనకు ఎన్​కౌంటర్లు కొత్తేమీ కాదు. అతి తెలివి ప్రదర్శించే నిందితుల తాట తీయడంలో ఆయనకు ఆయనే సాటి. తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎందరో ఉన్మాదులను, కామాంధులను ఏరిపారేసిన బృందాలకు ఆయనే నాయకత్వం వహించారు. అందుకే.. ఈ రోజు దిశ కేసు నిందితుల ఎన్​కౌంటర్​ బృంద సారథి సీపీ విశ్వనాథ్​ సజ్జనార్​ ఇంట్లో వేడుకలు అంబరాన్నంటాయి.

festival mode in the house of Vishwanath Sajjanar in Hubli celebrating disha encounter in hyderabad
'దిశ'కు న్యాయం- సజ్జనార్​ స్వస్థలంలో సంబరం
author img

By

Published : Dec 6, 2019, 5:12 PM IST

Updated : Dec 6, 2019, 8:02 PM IST

'దిశ'కు న్యాయం- సజ్జనార్​ స్వస్థలంలో సంబరం

దిశ కేసు నిందితుల ఎన్​కౌంటర్ బృందాన్ని నడిపించిన సారథి, సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్ విశ్వనాథ్​ సజ్జనార్ స్వస్థలం కర్ణాటక హుగ్లీ. నేడు ఆయన నివాసంలో వేడుకలు ఘనంగా జరిగాయి.​ మరోసారి సమాజంలోని చీడపురుగులను ఏరిపారేశారంటూ బంధువులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

కొత్తేమీ కాదు..

సజ్జనార్​ ఇంట్లో ఇలాంటి వేడుకలు కొత్తేమీ కాదు. ఎందుకంటే ఆయన నాయకత్వంలో జరిగిన ఎన్​కౌంటర్​ల జాబితా పెద్దదే మరి. అందుకే సజ్జనార్​ను ఎన్​కౌంటర్​ స్పెషలిస్ట్​ అంటారు.

2015లో హైదరాబాద్​లో ఐదుగురు ఉగ్రవాదులను ఎన్​కౌంటర్​ చేసింది విశ్వనాథ్​ బృందమే.

2008లో వరంగల్​ యువతిపై యాసిడ్​ దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది శ్రీనివాసరావు సహా​ అతడి ఇద్దరు స్నేహితుల ఎన్​కౌంటర్​ ఆయన ఆధ్వర్యంలో జరిగిందే. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులపై తుపాకీ గురి పెట్టి కుప్పకూల్చిన ఆ ఘటన ప్రజామోదం పొందింది.​ ఇప్పుడు అలాంటి దృశ్యమే మళ్లీ దిశ కేసులో పునారవృతం​ అయ్యింది. అందులోనూ విశ్వనాథ్ కీలక పాత్ర పోషించడం విశే​షం.

నిత్యం సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే విశ్వనాథ్​ పట్ల ఆయన కుటుంబం గర్వపడుతోంది.

'నా సోదరుడు(సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌) విధుల పట్ల అంకితభావం, నిజాయితీ గల వ్యక్తి. ఎప్పుడూ సామాజిక న్యాయం గురించి ఆలోచిస్తారు. సజ్జనార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయనకు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఘటనతో దేశం మొత్తం గర్విస్తోంది. అందులో మేము కూడా భాగస్వాములయ్యాం.'
-ప్రకాశ్​ సజ్జనార్​, సైబరాబాద్‌ సీపీ సోదరుడు

సజ్జనార్​ ప్రయాణం..

కర్ణాటకలోని హుగ్లీకి చెందినవారు విశ్వనాథ్​. చన్నప్ప సజ్జనార్​, గిరిజమ్మల ఆఖరి సంతానం ఆయన. బాల్యంలోనే తల్లి చనిపోయింది. చిన్నమ్మ మల్లమ్మ దగ్గరే పెరిగారు.

హుగ్లీలోనే లయన్స్​ ఇంగ్లీష్​ మీడియం స్కూల్​లో చదువుకున్నారు. ఇంటర్​, డిగ్రీ జగద్గురు గంగాధర కామర్స్ కాలేజీలో పూర్తి చేశారు. కర్ణాటక విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు. హైదరాబాద్​లో సివిల్స్​ కోచింగ్​ తీసుకుని 1996లో యూపీఎస్​సీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రప్రదేశ్​లోని కడప పులివెందులలో మొదటిసారిగా బాధ్యతలు చేపట్టారు సజ్జనార్​.

ఇదీ చదవండి:నిర్భయ కేసు దోషికి క్షమాభిక్ష నిరాకరణకు కేంద్రం సిఫార్సు

Last Updated : Dec 6, 2019, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.