సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని రైతు సంఘాలు స్వాగతించాయి. అదే సమయంలో చట్టాలు ఉపసంహరించుకునేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పాయి. మరోవైపు సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసేంత వరకు తాము ఎవరితోనూ చర్చలు జరపమని స్పష్టం చేశాయి.
చట్టాలపై స్టే విధించి నేపథ్యంలో తదుపరి కార్యచరణపై చర్చించేందుకు రైతులకు పిలుపునిచ్చింది 40 రైతు సంఘాల్లో ఒకటైన సంయుక్త్ కిసాన్ మోర్చా.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న రైతులు- కేంద్రం మధ్య ఇప్పటివరకు 9 విడతల్లో చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో రైతుల మీద కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ చట్టాల అమలుపై స్టే విధించింది అత్యున్నత న్యాయస్థానం.
ఇదీ చూడండి:- రైతు ఉద్యమం: మరో ఇద్దరు అన్నదాతలు మృతి