ETV Bharat / bharat

'ఫేస్​బుక్​ నిష్పాక్షికంగా, తటస్థంగానే పనిచేస్తోంది'

దేశంలో వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకే.. భాజపా నాయకులకు ఫేస్​బుక్​ అండగా ఉందంటూ వస్తోన్న ఆరోపణలను ఖండించారు ఆ సంస్థ భారత విభాగం ఎండీ అజిత్​ మోహన్​. తమ సంస్థ పక్షపాత వైఖరిని అవలంభించదని.. రాజకీయాలకు చాలా దూరమని స్పష్టం చేశారు.

Facebook neutral, non-partisan, its India chief says defending handling of hate speech
ఫేస్​బుక్​ పక్షపాతరహితంగా, తటస్థంగా పనిచేస్తుంది
author img

By

Published : Sep 20, 2020, 6:26 PM IST

ఫేస్​బుక్​ ఎప్పటికీ తటస్థ వేదిక అని.. పక్షపాతరహితంగా వ్యవహరిస్తుందని ఆ సంస్థ భారత విభాగం అధిపతి అజిత్​ మోహన్​ అన్నారు. ఫేస్​బుక్​ ఎవరివల్లా ప్రభావితం కాలేదని.. ఈ వ్యవహారాల్లో ఏ ఒక్కరూ జోక్యం చేసుకునేందుకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఫేస్​బుక్​ ఇండియాను.. భాజపా నేతలు ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ సామాజిక మాధ్యమ వేదిక పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఉద్ఘాటించారు.

అధికార భాజపా నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా.. దేశంలో తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకొనేందుకు ఫేస్​బుక్​ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఇటీవల 'ది వాల్​స్ట్రీట్​ జర్నల్​'లో ఓ కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలోనే స్పందించారు అజిత్​ మోహన్​.

కంటెంట్​ నిర్వహణలో ఫేస్​బుక్​ నిష్పాక్షిక విధానాలను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, సాంస్కృతిక, మత విశ్వాసాలకు అతీతంగా పనిచేసే వ్యవస్థ.. అమల్లో ఉందని వెల్లడించారు ఫేస్​బుక్​ భారత విభాగం ఎండీ అజిత్​ మోహన్​.

ఫేస్​బుక్​కు ఆరంభం నుంచి నిర్దేశిత లక్ష్యాలు ఉన్నాయని.. ఆ కార్యాచరణతోనే ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు మోహన్​.

ఫేస్​బుక్​కు భారత్​లో 30 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. దాని అనుబంధ సంస్థ.. ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​కు 40 కోట్ల మందికిపైగా యూజర్లు ఉన్నారు.

మొత్తంగా ఈ వివాదంతో ఫేస్‌బుక్‌ విద్వేషపూరిత పోస్ట్‌ల విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన కథనంతో.. ఫేస్‌బుక్‌కు ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఫేస్‌బుక్‌ వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, రాజకీయ దుమారం రేగడం వల్ల... ఫేస్‌బుక్‌ మున్ముందు ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: వివాదంలో బుక్కైన ఫేస్‌బుక్‌.. అసలేంటీ రగడ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.