ETV Bharat / bharat

కొత్త స్ట్రెయిన్​ ప్రాణాంతకమా? ఎదుర్కోవడమెలా? - does vacciens against new corona virus

కొత్త రకం కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టిస్తోంది. మానవాళిని మళ్లీ భయం గుప్పిట్లో బిగిస్తోంది. ఇంతకీ ఈ కొత్త స్ట్రెయిన్​తో తలెత్తే ఇబ్బందులేంటి? ఇది అత్యంత ప్రమాదకరమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నిపుణులు ఇలా సమాధానమిస్తున్నారు.

corona strain
స్ట్రెయిన్​ బారిన పడితే మరణమేనా?
author img

By

Published : Dec 31, 2020, 4:53 PM IST

కొత్త రకం కరోనా వ్యాప్తితో అంతర్జాతీయ సమాజం వణికిపోతోంది. ఇంతకుముందు వైరస్‌తో పోలిస్తే ఈ కొత్త రకం 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్త అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. బ్రిటన్​లో వెలుగుచూసిన ఈ స్ట్రెయిన్.. ఇప్పడిప్పుడే వివిధ దేశాల్లోకి క్రమంగా ప్రవేశిస్తోంది. మన దేశంలోనూ.. ఈ స్ట్రెయిన్​ కేసులు కలవరం పుట్టిస్తున్నాయి.

అయితే ఈ కొత్త వైరస్​ సోకితే మరణం తప్పదా? ఈ స్ట్రెయిన్​ను టీకాలు ఎదుర్కోలేవా? ఇలాంటి సందేహాలకు వైద్య నిపుణులు ఇచ్చే సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం.

కొత్త స్ట్రెయిన్​ ఎక్కడి నుంచి వచ్చింది?

చైనాలో ఏడాది క్రితం కరోనా​ ఆనవాళ్లు వెలుగుచూశాయి. అయితే.. అప్పటి నుంచి ఈ వైరస్​ ఎన్నో మార్పులు చెందుతూ వస్తోంది. ఒకరి నుంచి మరొకరి సోకుతున్నప్పుడు వైరస్​లో ఉత్పరివర్తనం జరగడం సహజమే.

వైరస్​ జన్యు అక్షర క్రమంలో ఒకటి లేదా రెండు అక్షరాల మార్పులతో ఈ ఉత్పరివర్తనాలు జరగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)కు చెందిన మాజీ శాస్త్రవేత్త డా.ఫిలిప్​ లాండ్రిగన్​ తెలిపారు. అయితే.. వైరస్​ ఉపరితలంలోని ప్రొటీన్​లలో మార్పులు జరిగినప్పుడే పరిస్థితి గందరగోళంగా తయారవుతుంది. ఫలితంగా.. మందులకు, రోగనిరోధక వ్యవస్థకు అందకుండా వైరస్ మార్పు చెందుతుంది.

కొత్త రకం వైరస్​ వ్యాప్తి అదుపు కష్టమా?

మార్పు చెందిన వైరస్​ ఒక నిర్దిష్ట ప్రాంతంలో విజృంభిస్తే.. అప్పుడు అదుపు తప్పుతుంది. ఉత్పరివర్తనంతో స్ట్రెయిన్​ ఏర్పడినప్పుడు కూడా.. ఎక్కువ స్థాయిలో వ్యాప్తి చెందడానికి దోహదమవుతుంది.

బ్రిటన్​లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందా? లేదా? అన్నదానిపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. అయితే.. ఇది వేగంగా వ్యాపిస్తోందనడానికి కొన్ని ఆధారాలను వారు కనుగొన్నారు. కొత్త స్ట్రెయిన్ వేగంగా కదిలి, ఎక్కువ మందికి సోకుతున్నట్లు పరిశోధకులు గుర్తించారని డా.ఫిలిప్​ లాండ్రిగన్ చెప్పారు. సెప్టెంబర్​లోనే బ్రిటన్​లో కొత్త స్ట్రెయిన్​ వెలుగు చూసిందని డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది. అప్పుడే దక్షిణాఫ్రికాలోనూ ఈ వైరస్​ బయటపడినట్లు తెలుస్తోంది.

corona strain
స్ట్రెయిన్​ బారిన పడితే మరణమేనా?

కరోనా కొత్త స్ట్రెయిన్​తో వచ్చే సమస్యలేంటి?

ఇప్పటి వరకు దాదాపు 24 సార్లు వైరస్​లో ఉత్పరివర్తనం జరిగింది. 8 సార్లు స్పైక్​ ప్రొటీన్​లో మార్పులు జరిగాయి. దానివల్ల వైరస్​ సులభంగా కణాలకు సోకుతోంది. ప్రస్తుతం కొవిడ్​ చికిత్స కోసం ఉపయోగిస్తున్న మందులు, వ్యాక్సిన్లు ఈ ప్రొటీన్​ను లక్ష్యంగా చేసుకుని తయారు చేసినవే.

బ్రిటన్​లో వెలుగు చూసిన ఈ స్ట్రెయిన్​.. గతంలో కంటే రెండు రెట్ల వరకు అధికంగా వ్యాప్తి చెందగలదని ఇంగ్లాండ్​లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ వైరాలజీ నిపుణుడు డాక్టర్​ రవి గుప్తా పేర్కొన్నారు. ఆయనతో పాటు మరి కొంత మంది పరిశోధకులు.. ఓ వెబ్​సైట్​లో ఈ విషయాలను పంచుకున్నారు. అయితే.. వాళ్లు చెప్పిన అంశాలు ఇంతవరకు ఏ జర్నల్​లోనూ అధికారికంగా ప్రచురితం కాకపోవడం గమనార్హం.

ఈ స్ట్రెయిన్​ సోకితే తీవ్ర అనారోగ్యానికి గురవుతారా? మరణానికి దారితీస్తుందా?

ఈ విషయాలు నిజమని చెప్పేందుకు ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ డాక్టర్​ లాండ్రిగన్​ ఇక్కడ రెండు విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. ఒకటి.. కొత్త స్ట్రెయిన్​ ఎక్కువగా వ్యాపిస్తుంది. రెండు.. దీనివల్ల అనారోగ్యానికి గురైతే త్వరగా తెలుస్తుంది.

అయితే.. ఈ కొత్త రకం కరోనాతో వ్యాధి తీవ్రతలో ఎలాంటి మార్పులు లేవని డబ్ల్యూహెచ్​ఓ వ్యాధి నిపుణుడు మరియా వాన్​ కెర్​ఖోవ్​ తెలిపారు.

ఈ ఉత్పరివర్తనాలు చికిత్సకు లొంగవా?

వైరస్​లోని ఈ ఉత్పరివర్తనాలు... మందులకు లొంగటం లేదని ఇంగ్లాండ్​లో కొన్ని కేసుల్లో బయటపడింది. యాంటీబాడీలు​ ఏర్పడకుండా వైరస్​ అడ్డుకుంటోందని తేలింది. అయితే.. ఈ స్ట్రెయిన్​​ సోకినప్పుడు యాంటీబాడీల స్పందనపై అధ్యయనం కొనసాగుతున్నట్లు వాన్​ కెర్​ఖోవ్ తెలిపారు.

స్ట్రెయిన్​పై వ్యాక్సిన్లు ప్రభావం చూపలేవా?

ప్రస్తుతం తయారు చేస్తున్న టీకాలు.. ఈ కొత్త స్ట్రెయిన్​పైనా అంతే ప్రభావాన్ని చూపగలవని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. దీనిపై నిజానిజాలు తేల్చేందుకు వారు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ కొత్త రకం కరోనాపై సమర్థంగా పనిచేయబోవు అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని బ్రిటన్​​ అధికారులు స్పష్టం చేశారు.

యాంటీబాడీలు మాత్రమే ఏర్పడకుండా.. వైరస్​ను ఎదుర్కొనేందుకు రోగనిరోధక వ్యవస్థ సిద్ధం చేసేందుకు వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. అందువల్ల.. ఈ కొత్త రకం కరోనా పైనా టీకాలు అంతే ప్రభావవంతంగా పనిచేయగలవని నమ్ముతున్నారు.

మరి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడమెలా?

ఇంతకు ముందు నుంచి వైరస్​ బారిన పడకుండా ఏవైతే జాగ్రత్తలు పాటిస్తున్నామో.. ఈ కొత్త స్ట్రెయిన్​ నుంచి తప్పించుకోవడం కోసం కూడా అవే పాటించాలని డబ్ల్యూహెచ్​ఓ సూచిస్తోంది. ముఖానికి మాస్కు ధరించాలి. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. భౌతికదూరం పాటించాలి. ఈ నిబంధనలను పాటించకుండా.. మనం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. అంతగా ఈ కొత్త రకం కరోనా వ్యాప్తికి కారకులమవుతాం.

ఇదీ చూడండి:ఆక్స్​ఫర్డ్ టీకా సురక్షితమా? ఈ సందేహాల సంగతేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.