దిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో సేవలు పునః ప్రారంభమైనట్లు డీఎంఆర్సీ అధికారులు తెలిపారు. పౌర చట్ట వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడం వల్ల ఆదివారం మెట్రో సేవలను నిలిపివేశారు.
"దిల్లీలోని అన్ని మెట్రోస్టేషన్లలో భద్రత పరమైన ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, సాధారణ సేవలు పునఃప్రారంభమయ్యాయి."
-డీఎంఆర్సీ అధికారులు ట్వీట్.
ఆదివారం నాడు ఆగ్నేయ దిల్లీలో పౌర చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో దిల్లీలోని 13 మెట్రో స్టేషన్లను మూసివేశారు దిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ అధికారులు.
ఇదీ చూడండి:'దిల్లీ హింసపై మోదీ నోరు మెదపకపోవడం దారుణం'