ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్.. మరో జవాను మృతి

ఛత్తీస్​గఢ్​లో నక్సలైట్లు- భద్రతా బలగాల మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను మృతిచెందారు. మరొక జవాను తీవ్రంగా గాయపడ్డారు. ధంతరి జిల్లాలోని ఛమేదా గ్రామ సమీపంలో సాల్హేభాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్.. భారీగా నక్సల్స్ మృతి?
author img

By

Published : Apr 5, 2019, 9:13 AM IST

Updated : Apr 5, 2019, 1:16 PM IST

ఛత్తీస్​గఢ్ ధంతరి జిల్లాలోని సాల్హేభాట్​ ప్రాంతంలో నక్సలైట్లు- భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సీఆర్​పీఎఫ్ సిబ్బంది ఒకరు మృతిచెందారు. మరొక జవాను గాయపడ్డారు.

ఎన్​కౌంటర్​లో గాయపడ్డ జవాను

కాల్పులు... పరారీ...

నక్సల్స్​ ఏరివేతకు ఈ నెల 3న 50మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు, 10మంది జిల్లా పోలీసులు ఖల్లారీ, బొరాయీ​ పోలీస్​ స్టేషన్ల పరిధిలో కూంబింగ్ చేపట్టారు.
శుక్రవారం ఉదయం ఛమేదా గ్రామ సమీపంలో జవాన్లపై నక్సలైట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఎదురుకాల్పులకు దారితీసింది. జవాన్లపై కాల్పులు జరిపిన మావోయిస్టులు ఘటనాస్థలం నుంచి తప్పించుకున్నారు.

ఘటనాస్థలానికి చేరుకున్న అదనపు బలగాలు హెడ్​ కానిస్టేబుల్ హరీశ్​చంద్ మృతదేహాంతోపాటు గాయపడ్డ మరో జవాన్ సుధీర్​కుమార్​​ను ఆసుపత్రికి తరలించాయి.

కాన్ఖేర్​ జిల్లాలో గురువారమే నలుగురు బీఎస్​ఎఫ్​ జవాన్లను పొట్టనబెట్టుకున్న నక్సల్స్ మరో ఇద్దరు సిబ్బందిని గాయపరిచారు.

Intro:Body:Conclusion:
Last Updated : Apr 5, 2019, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.