ETV Bharat / bharat

60 రోజులు వధువు ఇంట్లోనే పెళ్లి బృందం

author img

By

Published : May 22, 2020, 2:37 PM IST

వివాహ తంతు ముగిసింది. ఇక స్వస్థలానికి వెళ్దాం అనుకునేలోపే లాక్​డౌన్​ పడింది. అలా వధువు ఇంటికి వెళ్లిన పెళ్లి కొడుకు సహా 11 మంది బంధువులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఒకరోజు కాదు రెండురోజుల కాదు ఏకంగా 60 రోజుల వాళ్లింటిలోనే మకాం వేశారు. నాలుగో దశలో లాక్​డౌన్​ మినహాయింపుల వల్ల నూతన వధూవరులు స్వస్థలానికి చేరుకున్నారు. వారిని 14 రోజులు హోం క్వారంటైన్​కు పంపారు అధికారులు.

60 days in the bride's home
వధువు ఇంట్లో 60 రోజులు ఉండిపోయిన పెళ్లి​బృందం

పెళ్లి ఘనంగా చేసుకున్నారు. బరాత్​ ముగిసింది. ఇక వధువును తీసుకుని ఇంటికి వచ్చేద్దాం అనుకున్న పెళ్లి కుమారుడి కుటుంబానికి లాక్​డౌన్​తో చిక్కులొచ్చాయి. వరుడు సహా 11 మంది బంధువులు.. వధువు ఇంట్లోనే మకాం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా 60 రోజులు గడిచాక కొత్త దంపతులు స్వస్థలానికి చేరుకున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​ చౌబేపుర్​లోని హకీమ్​నగర్​ గ్రామానికి చెందిన ఇంతియాజ్​, బిహార్​ బెగుసరాయ్​కు చెందిన ఖుష్భూకు మార్చి 21న వివాహం అయింది. పెళ్లికూతురు స్వస్థలంలో పెళ్లి తంతు ముగిసింది. ఇక వచ్చేద్దాం అనుకునేలోపే మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్​డౌన్​ ప్రకటించింది ప్రభుత్వం. రవాణా సదుపాయాలు లేక పెళ్లికొడుకుతో పాటు బంధువులు అందరూ ఏకంగా రెండు నెలలు పెళ్లికూతురు ఇంటిలోనే ఉండిపోయారు. తాజాగా నాలుగోదశ లాక్​డౌన్​ మినహాయింపుల వల్ల వాళ్లకి ఊరట లభించింది. దాదాపు 60 రోజులు తర్వాత కాన్పుర్​లోని స్వస్థలం చేరారు నూతన వధూవరులు.

"వధువు ఇంట్లో చిక్కుకుపోవడం వల్ల చాలా హెల్ప్​లైన్​ నంబర్లను సంప్రదించాం కానీ మాకు సహాయం అందలేదు. చేసేదేమి లేక వాళ్ల ఇంటిలోనే ఉన్నాం. పెళ్లికూతురు కుటుంబానికి మా వల్ల అధిక భారం పడింది. ఏలాగైతేనే రెండు రోజుల క్రితం జిల్లా అధికారుల ద్వారా పాస్​లు పొందాం. ఆ తర్వాత ఓ మినీ బస్సు ఏర్పాటు చేసుకొని మే 19న బెగుసరాయ్​ నుంచి బయలుదేరాం. 20 గంటల ప్రయాణంలో హైవే మీద చాలా మంది ఆహారం, మంచినీళ్లు ఉచితంగా అందించారు. ఇబ్బందులు పడి ఇంటికొస్తే కరోనా పరీక్షలు చేసి మమ్మల్ని 14 రోజులు హోం క్వారంటైన్​లో ఉండాలని అధికారులు సూచించారు"

-మెహబూబ్, పెళ్లి కుమారుడి తండ్రి

పెళ్లి బృందానికి అక్కడ స్థానికులు మంచి మద్దుతు ఇచ్చారట. వధువు కుటుంబానికి అందరూ రేషన్​ అందించారని తెలిపాడు ఓ బంధువు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.