ETV Bharat / bharat

కేరళ ఏనుగు మృతిపై సుప్రీంలో పిటిషన్​

కేరళలో మృతి చెందిన గర్భిణి ఏనుగు కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటన వెనుక ఓ పెద్ద ముఠా ఉన్నట్లు పిటిషనర్ పేర్కొన్నారు​.

Elephant death in Kerala: Plea in SC seeks probe by CBI or SIT
'కేరళ ఏనుగు మృతిపై సీబీఐ విచారించాలి'
author img

By

Published : Jun 7, 2020, 7:55 PM IST

కేరళలో గర్భిణి ఏనుగు మరణించిన ఉదంతంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దిల్లీకు చెందిన అవద్​ బిహారి కౌషిక్​ అనే న్యాయవాది ఈ పిటిషన్​ దాఖలు చేశారు.

ఈ ఘటన వెనుక ఏనుగులను చంపేందుకు ఓ వ్యవస్థీకృత ముఠానే ఉన్నట్లు తెలిపారు కౌషిక్​. ఇటువంటి వాటి నుంచి జంతువులను కాపాడటంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు.

కేరళలోని కొల్లాం జిల్లా పథనంపురంలో ఏప్రిల్‌లో ఇదే తరహాలో మరో ఏనుగు చనిపోయిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ తరహా కేసులకు సంబంధించిన పూర్తి రికార్డులను కోర్టుకు సమర్పించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఏనుగుల హత్యలపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

ఇది చూడండి : 'భరించలేని నొప్పి, ఆకలితోనే ఏనుగు మృతి'

ఇదీ చూడండి : మనిషిని నమ్మడమే అది చేసిన తప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.