ETV Bharat / bharat

కాంగ్రెస్​కు షాక్​.. ఏజేఎల్​ కేసులో ఆస్తులు అటాచ్​ - మేనేజింగ్​ డైరెక్టర్​

ED attaches assets worth Rs 16.38 crore of Congress-promoted AJL
కాంగ్రెస్​కు షాక్​.. ఏజేఎల్​ కేసులో ఆస్తులు అటాచ్​
author img

By

Published : May 9, 2020, 2:07 PM IST

Updated : May 9, 2020, 2:43 PM IST

14:32 May 09

కాంగ్రెస్​కు సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్​)కు చెందిన రూ.16.38 కోట్లు విలువైన ఆస్తుల్ని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అటాచ్ చేసింది. ఆ పార్టీ నేత, ఏజేఎల్​ ఛైర్మన్​, మేనేజింగ్​ డైరెక్టర్​ మోతీలాల్ వోరా పేరును తాత్కాలిక జప్తు నోటీసులో ప్రస్తావించింది.

అటాచ్​ చేసిన ఆస్తుల్లో ముంబయి బాంద్రాలోని 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన 9 అంతస్తుల భవనం ఉంది. భూకేటాయింపులకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో.. మనీలాండరింగ్​ నియంత్రణ చట్టం కింద వోరాకు నోటీసులు జారీ చేసింది ఈడీ.  ​  

గాంధీలదే...

నిజానికి ఏజేఎల్​ కాంగ్రెస్​ అగ్రనేత కనుసన్నల్లో పనిచేస్తుంది. ముఖ్యంగా గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది. ఈ ఏజేఎల్ గ్రూప్​ నేషనల్ హెరాల్డ్ పత్రికను నడుపుతోంది.

ఇదీ కేసు..

1982లో ఏజేఎల్​కు హిందీ పత్రిక 'నవజీవన్​'ను నడపడానికి ఛండీగఢ్​లోని పంచకులలో స్థలం కేటాయించారు. అయితే 1992 వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఫలితంగా హరియాణా పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్​యూడీఏ) ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని మనీలాండరింగ్​ నియంత్రణ చట్టం కింద ఈడీ గతంలో కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ సీనియర్​ నేత మోతీలాల్​ వోరా, హరియాణా మాజీ సీఎం భూపేందర్​సింగ్ హుడా పేర్లను ఛార్జిషీటులో చేర్చింది. ఈ విషయంలో సీబీఐ కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి విచారిస్తోంది.

హరియాణా బీజేపీ నాయకుల విజ్ఞప్తితో సీబీఐ ఎఫ్​ఐఆర్ ఆధారంగా... 2016లో ఈడీ కూడా పీఎమ్​ఎల్​ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. తాజాగా ముంబయిలోని ఆస్తుల్ని జప్తు చేసింది.  

14:02 May 09

కాంగ్రెస్​కు షాక్​.. ఏజేఎల్​ కేసులో ఆస్తులు అటాచ్​

నేషనల్ హెరాల్డ్​ కేసులో కాంగ్రెస్​ అగ్రనేతలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్​కు సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్​)కు చెందిన రూ.16.38 కోట్లు విలువైన ఆస్తుల్ని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ అటాచ్ చేసింది. ఆ పార్టీ నేత మోతీలాల్ వోరా పేరును తాత్కాలిక జప్తు నోటీసులో ప్రస్తావించింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, మరికొందరు పార్టీ నేతలు నిందితులు. వారు ప్రస్తుతం బెయిల్​పై బయట ఉన్నారు.

Last Updated : May 9, 2020, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.