ETV Bharat / bharat

చందా కొచ్చర్​తో కఠినంగా వ్యవహరించం: ఈడీ - తుషార్ మెహతా

మనీలాండరింగ్​ కేసు విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్​తో కఠినంగా వ్యవహరించమని సుప్రీం కోర్టుకు తెలిపింది ఈడీ. ఈ మేరకు సోలిసిటర్​ జనరల్ తుషార్​ మెహతా ధర్మాసనానికి వివరణ ఇచ్చారు.

Chanda Kochhar_ED
చందా కొచ్చర్​తో కఠినంగా ప్రవర్తించం: ఈడీ
author img

By

Published : Nov 20, 2020, 5:42 PM IST

ఐసీఐసీఐ బ్యాంక్​ మాజీ సీఈఓ చందా కొచ్చర్​పై ఉన్న మనీలాండరింగ్​ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించబోమని సుప్రీంకోర్టుకు తెలిపింది ఈడీ.

ఈ మేరకు ఈడీ చర్యలపై... జస్టిస్​ ఎస్​ కే కౌల్​ నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనానికి వివరణ ఇచ్చారు సోలిసిటర్​ జనరల్ తుషార్​ మెహతా. ఐసీఐసీఐ-వీడియోకాన్​ రుణాల కేసు విషయంలో ఈడీ బలవంతపు చర్యలు చేపట్టలేదని తెలిపారు.

ఈ కేసుపై తీర్పు ఇచ్చిన జస్టిస్​ దినేష్ మహేశ్వరి, జస్టిస్​ హృషికేశ్ రాయ్... చందాకొచ్చర్​ దాఖలు చేసిన రెండు పిటిషన్​లపై తర్వాత విచారణ జరుపుతామని చెప్పారు. తన భర్త దీపక్​ కొచ్చర్​ అరెస్టును సవాల్​ చేస్తూ చందా కొచ్చర్​ ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

ఇటీవలే, ఈడీ.. చందాకొచ్చర్​, దీప్​ కొచ్చర్​, వీడియోకాన్​ గ్రూప్​ ప్రమోటర్ వేణు గోపాల్​ దూత్​పై ఉన్న మనీలాండరింగ్ కేసుపై చార్జిషీట్ దాఖలైంది. వీడియోకాన్​ గ్రూప్​కు రూ.1,875 కోట్ల అక్రమంగా రుణాలు మంజూరు చేసినందుకు చందాకొచ్చర్​తో పాటు మరి కొంతమందిపై కేసు నమోదైంది.

ఇదీ చదవండి:'రాజకీయాల వల్లే నా రచనల్లో వైవిధ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.